health tips in telugu
రాత్రి పూట అన్నం లేదా చపాతి తినడం ఏది మంచిది..?
మనలో చాలా మంది ఉదయం లేవడం కష్టంగా , బద్ధకంగా ఫీలవుతూ ఉంటారు. ఇలాంటి వారు రాత్రిపూట అన్నానికి బదులు చపాతి తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్యనిపుణలు చెబుతున్నారు.
చపాతీకి ఉపయోగించే గోధుమల్లో విటమిన్ బి, ఇలతోపాటు కాపర్, జింక్, అయోడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం, క్యాల్షియం వంటి ఖనిజాలతో పాటు అనేక పోషకాలు లభిస్తాయి.

ఊబకాయం, అధికబరువు, అజీర్తి, మలబద్దక సమస్యలతో బాధపడేవారు రాత్రిపూట చపాతీ తీసుకోవడం చాలా మంచిది.
రాత్రిపూట మనం నిద్రపోవడం తప్ప ఏ పనిచెయ్యం. అందువల్ల శరీరంలో క్యాలరీలు ఖర్చవ్వకుండా, కొవ్వుగా మారి అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే చపాతీలు అధిక క్యాలరీలు కలిగి ఉన్నప్పటికీ ఇవి కొవ్వుగా మాత్రం మారవు.
గోధుమలలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో ఉండే అధిక శాతం ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.