health tips in telugu
Health Benefits Of Egg: గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డు
చౌక ధరలో అందరికీ అందుబాటులో ఉండే పౌష్టికాహారం కోడిగుడ్డు. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. గుడ్డులో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి.
గుడ్డులో పలురకాల లవణాలతో పాటు, అరుదైన ఖనిజాలు పాస్పరస్, సెలీనియం, ఐరన్, జింక్‌లు ఉన్నాయి.
కంటి ఆరోగ్యానికి గుడ్డు ఎంతో మంచిది. ఇందులో విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి.

రోజూ వారీ ఆహారంగా గుడ్డును చేర్చుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గుడ్డులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ల ద్వారా రొమ్ము క్యాన్సర్‌లను నియంత్రించవచ్చు.
గుడ్డులో నాణ్యమైన ప్రొటీన్‌లు మెండుగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దాంతో ఆహారాన్ని మితంగా తీసుకుంటాం. అందువల్ల బరువును నియంత్రించుకుంటాం.
గడ్డును ఫేస్ ప్యాక్‌కు, హెయిర్ ప్యాక్‌కు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.