health tips in telugu
ఖర్బూజా పండు తింటున్నారా అయితే ఇవి తప్పక తెలుసుకోవాలి..
వేసవిలో విరివిగా దొరికే కర్బూజా పండు తినడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండు అనేక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. ఇందులో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ ఎ, సి, ఫోలిక్ యాసిడ్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి.
ముఖ్యంగా ఎండాకాలంలో వీటిని తినడం వలన శరీర వేడిని తగ్గించుకోవచ్చు. ఇది ఒంటికి ఎంతో చలువను చేస్తుంది.

ఇందులో కేలరీస్ తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన బరువు ఎక్కువగా ఉన్నవారు త్వరగా లావు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
అసిడిటీ, గ్యాస్, అజీర్తి, మలబద్దకం, ఆకలి లేకపోవడం ఇలాంటి సమస్యలకు కర్బూజ పండు ఒక చక్కటి పరిష్కారం. ఈ పండు శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటు, ఎముకలను బలంగా ఉంచుతుంది.
ఇది గుండెకు చాలా మంచి చేస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరిచి గుండెను బాగా పనిచేసేలా చేస్తుంది.