గులాబీ వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
గులాబీ అందాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. గులాబీలను సాంప్రదాయ సౌందర్య సాధనంగా, వంటకాల్లో సైతం వాడుతున్నారు. ఇందులో విటమిన్ ఎ, బి3తో పాటు విటమిన్ సిను సమృద్ధిగా కలిగి ఉంది. అంతే కాకుండా ఐరన్, కాల్షియం, జింక్‌ను కలిగి ఉంది.
గులాబీ రేకులను తరచూ తీసుకోవడం ద్వారా రక్తశుద్ధి జరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇది మన యూరినరి సమస్యలను తగ్గించడంతోపాటు మలబద్దకాన్ని దూరం చేస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి జీవక్రియలు సాఫీగా ఉండేలా చూస్తుంది.
గులాబీ రేకులు సాంప్రదాయ వైద్యంలో వాడతారు. జీర్ణలోపాలు, శరీరంపై ఏర్పడే గాయాలు, మహిలలలో రుతుకాలంలో ఏర్పడే నొప్పులను తగ్గించడానికి వాడతారు.
గులాబీ రేకులు చర్మానికి చేసే మేలు అంతాఇంతా కాదు. ఇది చర్మంలోని ఆయిల్‌ను కంట్రోల్ చేస్తుంది. చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది. ఇది ఒక మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. యు.వి. కిరణాల నుంచి రక్షిస్తుంది.