Summer Special: శక్తినిచ్చే చెరకు రసం
చెరకు రసంలో అద్భుతమైన శక్తి ఉంది. అధిక దప్పికను తగ్గించడంతో పాటు అప్పటికప్పుడు జీవకణాలకి శక్తినిచ్చే పానీయం చెరకు రసం అని చెప్పవచ్చు. శరీరానికి పలు రకాలుగా మేలు చేసే చెరకు రసం త్రాగడం వలన కలిగే లాభాలేంటో చూద్దాం.
వేసవిలో చెమట రూపంలో శరీరంలోని పోషకాలను నష్టపోతూ ఉంటాం. చెరకులో క్యాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియంలు అధిక మొత్తంలో ఉన్నాయి. చెరకు రసం తీసుకోవడం వల్ల ఈ ఖనిజాలు తిరిగి భర్తీ అవుతాయి.

మన శరీరంలో కాలేయం చాలా ముఖ్యమైనది. తాజా అధ్యయనాల ప్రకారం చెరకు రసం త్రాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగవుతుందని తెలిసింది.
చెరకులో ఉండే పొటాషియం మీ జీర్ణ సమస్యలను నివారిస్తుంది. తాజా చెరకు రసాన్ని తరచుగా తీసుకోవడం వలన కడుపులో ఏర్పడే ఇన్‌ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.
శరీరంలో వేడిని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి తరచుగా వచ్చే జ్వరాలను నివారిస్తుంది. మూత్రవరోధాలను తొలగించి మూత్రం తేలికగా పోయేటట్లు చేస్తుంది.