స్వామి ఆరాధన లో ఆరోగ్య రహస్యాలు
అయ్యప్ప స్వామి ఆరాధనలో ఆరోగ్య రహస్యాలు.
కార్తీక మాసం,మార్గశిర మాసం అయ్యప్ప స్వామి దీక్షల సమయం. నియామాల మాల వేసి ఒక మండలం పాటు ఆచరిస్తూ భగవంతుని యెడల భక్తి చాటుతూ సుగుణాలు అలవరచు కోవడమే దీక్షా అంతరార్ధం.
అయ్యప్ప స్వామి దీక్ష లో పాటించే నియమాలు ఆధ్యాత్మికం గాను, శారీరకంగా , మానసికంగా పరిపుష్టి సాధించడం లో మనకు ఎంతగానో సాయం చేయును. ఉభయ సంధ్యలలో చన్నీళ్ళ స్నానం శరీరాన్ని వజ్రతుల్యము చేయును. నియమిత, పరిమిత, సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఓబీసిటీ క్లియర్ అవడం తో పాటు శరీర సమతుల్యత ఏర్పడుతుంది.
దీక్షలో నలుపు బట్టలు ధరించడం వల్ల శరీరానికి అవసరం ఉన్న ఉష్ణం ను వాతవరణం నుండి, సూర్య రశ్మి నుండి గ్రహిస్తాయి. ఆహరం లో ఉల్లి వెల్లుల్లి మసాలా దినుసులు నిషేధం వల్ల ఉద్రేకాలు కలిగించే హార్మోన్స్ విడుదల అరికట్టి మనసు చలించకుండా లగ్నం చేయడం సాయ పడుతాయి. ఇలాంటి ఎన్నో ఆరోగ్య నియమాలు అయ్యప్ప దీక్ష లో ఉన్నయి మరిన్ని విశేషాలు రాబోయే కథనంలో . . .
స్వామియే శరణం అయ్యప్ప