health tips in telugu

మన దేశంలో 30-69 వయసు వారిలో పెరుగుతున్న గుండె పోటు మరణాలు

గుండె పోటు అంటే ఒకప్పుడు ఏ 70 ఏళ్ల వారికో వస్తుంది. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు యువత అనే చెప్పుకునే వయసు వారికి కూడా రావడం బాధాకరం. తాజాగా గుండె జబ్బుల పై చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం తేలింది. అందులోను 30-69 వయసు ఉండే వారిలో పల్లెటూళ్ళల్లో ఈ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయట. గుండె పోటు కంటే గుండెలో రక్త నాళాలు పూడుకుపోవడం ఎక్కువ మరణాలు సంభావిస్తున్నాయట. అన్నిటికీ మించి 1970 తరవాత పుట్టిన వారిలో ఒకలాంటి గుండె సమస్యలు ఉంటున్నయనీ వాటి పై కనీసం ఎవరికీ అవగాహన కూడా లేదనీ ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డా. ఝా చెప్పారు. అందువల్ల 30 లు దాటిన ప్రతీ ఒక్కరు గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ పరిశోధన Lancet Global Health అనే జర్నల్ లో ప్రచురించబడింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button