Today Telugu News Updates

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు వార్నింగ్, High court fires on TS govt

 కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్యశాఖ సంచాలకుడు ఉత్తర్వులు జారీ చేయడం ఆశ్చర్యకరంగా ఉందని, High court fires on TS govt ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారని తెలంగాణ హైకోర్టు మండిపడింది . రాష్ట్రంలో కరోనా పరీక్షలు , మీడియా బులెటిన్లో అరకొర సమాచారం ఇస్తుండడంపై హైకోర్టు మరోసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది . తమ ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని హైకోర్టు – ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది .

 మీడియా బులెటిన్లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది . రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమేంటో చెప్పాలని నిలదీసింది . కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు సమర్పించాలని ఆదేశించింది . గత ఇరవై రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు హైకోర్టుకు వెల్లడించాలని కోరింది . కేంద్ర బృందం పరిశీలనలో ఏయే అంశాలు చేరాయని ఆ వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది . ప్రభుత్వం జీవించే హక్కును కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది . గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది . నివేదికలు సమర్పించకపోతే కోర్టు ధిక్కరణగా భావిస్తామని , ఆర్ ఏడీ బ్లడ్ శాంపిల్స్ ఎందుకు చేయకూడదని , పది నిమిషాల్లో రిజల్ట్ వచ్చే  పరీక్షలు చేయాలని గతంలో ఆదేశించిన విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది .

High court fires on TS govt ::

 కరోనా బారిన పడిన వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి మూడు రోజులైనా ఆ పరీక్షలు ఎందుకు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు . 50 వేల టెస్టులు చేస్తామని ప్రకటించి వైద్య పరీక్షలను ఆపివేయడం వెనక అంతర్యమేమిటని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది . ఇప్పటికైనా ఆర్ఎడీ శాంపిల్స్ సేకరించాలని పిటీషనర్ కోర్టును కోరారు . మే 23 నుంచి జూన్ 28 వరకు ఎన్ని టెస్టులు చేశారని ప్రైమరీ , సెకండరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది . జూన్ 26 న ఐసీఎమ్మార్ గైడ్ లైన్ ప్రకారం లక్షణాలు ఉన్న వారికి , లేని వారికి ఎన్ని పరీక్షలు చేశారో తెలపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది .

 ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం ఎక్కడెక్కడ పర్యటించిందని , ఈ పర్యటనలో ఏయే అంశాలను వారు అధ్యయనం చేశారని ఆ విషయాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని కోరింది . ఈ వివరాలను ఈనెల 17 న తెలపాలని హైకోర్టు పేర్కొంది . ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని , ఆ విధంగా ప్రభుత్వం వ్యవహరించరాదని హైకోర్టు స్పష్టంచేసింది . ఏప్రిల్ 21 , జూన్ 8 , జూన్ 18 న ఎన్నెన్ని కిట్స్ ఇచ్చారని , దీన్ని కూడా కోర్టు ధిక్కరణ కింద తీసుకుంటున్నామని , 17 వ తేదీ వరకు ఆదేశించిన పనులు పూర్తి చేయకపోతే అధికారులు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది . ఈ కేసు విచారణను ఈనెల 17 వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ఆ రోజున ప్రభుత్వం నుంచి సానుకూలస్పందన రాకపోతే జూలై 20 న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ కోర్టుకు హాజరు కావలసి వస్తుందని హెచ్చరింది .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button