Tollywood news in telugu
Chiranjeevi Corona Negative: చిరుకి నెగెటివ్ … ఇంత త్వరగా ఎలా ?

చిరంజీవికి కరోనా సోకిందన్న విషయం తెలియగానే సినీ ప్రపంచం ఒక్క సరిగా ఉలిక్కి పడింది. తాను కరోనా నుండి కోలుకోవాలని అభిమానులు ఎన్నో పూజలు చేసారు. కానీ చిరు కి అసలు కరోననే సోకలేదట ఈ విషయం అతనే స్వయంగా వెల్లడించాడు..
అసలు విషయం ఏంటంటే చిరు షూటింగ్ లో పాల్గొనే ముందు నిబంధనల ప్రకారం కరోనా టెస్ట్ చేయించుకోవాలి, చిరు కూడా అదేచేసాడు. కానీ ఒక ఫాల్ట్ కిట్ తో టెస్ట్ చేయడం వాళ్ళ రిజల్ట్ తేడాగా వచ్చింది.
చిరు హోమ్ క్వారంటైలో ఉన్నపటికీ ఎలాంటి లక్షణాలు కనపడక పోవడంతో చిరుకి రిజల్ట్ పై అనుమానం వచ్చి మల్లి మూడు సార్లు టెస్ట్ చేయించుకోవడంతో అది కాస్త నెగెటివ్ అని తేలింది.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు.