అరికాళ్లు, అరిచేతుల్లో మంటలు, తిమ్మెర్లా అయితే ఇలా చేసి చూడండి..
అనేక రకాల వ్యాధుల నివారణలో పసుపును ప్రత్యేకించి వాడతారు. పసుపు శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒక గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల పసుపు వేసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. అలాగే పసుపును పేస్ట్‌గా చేసి మంటలు వచ్చే ప్రదేశంలో పైపూతగా పూసిన ఉపశమనం లభిస్తుంది.
ఒక తొట్టెలో గోరువెచ్చటి నీటిని తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పును వేసి బాగా కలపండి. ఇప్పుడు నీటిలో సుమారు 15 నిమిషాలు మీ పాదాలను ఉంచండి. తరచూ ఇలా చేయడం వలన అరికాళ్ల మంటలు, తిమ్మెర్లు తగ్గుముఖం పడతాయి.

కాకరకాయ ఆకుల్లో కూడా ఈ సమస్యల్ని నివారించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని కాకరకాయ ఆకుల్ని తీసుకుని వాటిని మెత్తగా రుబ్బి, ఆ పేస్టును సమస్యాత్మక ప్రాంతాల్లో పైపూత పూయండి. తరువాత ఆ పేస్ట్‌ణు రబ్ చేస్తూ తొలగించండి. ఇలా చేయడం వలన మంచి ఫలితాన్ని పొందచ్చు.
అల్లం కూడా ఈ సమస్యలను తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది. అల్లం శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్ల మంటలను తగ్గిస్తుంది. ఒక కప్పు పాలలో అల్లం కలిపి, వేడి చేసి ఆ పాలను రోజూ తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.