technology information

ఇండియన్ మార్కెట్ లో సందడి చేయబోతున్న హానర్ 9 ఎన్ స్మార్ట్ ఫోన్

హువాయ్ యొక్క సబ్ బ్రాండ్, హానర్ ఇండియాలో తన న్యూ స్మార్ట్ ఫోన్ హానర్ 9N ను ప్రారంభించింది. ఈ లాంచింగ్ ఈవెంట్ న్యూఢిల్లీలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు. గత నెలలో చైనాలో ప్రవేశపెట్టిన ఆనర్ 9i(2018) యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా ఈ డివైస్ ని ఇండియాలో లాంచ్ చేసారు. దీని ధర 11,999 రూపాయలు. ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్ వెబ్ సైట్ లో జూలై 31, 2018 మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ముఖ్యంగా మిడ్ నైట్ బ్లాక్, షపైర్ బ్లూ, లావెండర్ పర్పుల్, మరియు రాబిన్ ఎగ్ బ్లూ అనే నాలుగు కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి మరియు ఇది ఇటీవల విడుదల చేయబడిన హువాయ్ P20 లైట్ తో  సమానంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒకే ఒక్క తేడా ఏమిటంటే నిర్మాణం కోసం మెటల్ బదులుగా ప్లాస్టిక్ ని యూస్ చేసారు మరియు డ్యూయల్ కెమెరా సెటప్ యొక్క ప్లేస్మెంట్ హానర్ 9N లో అడ్డంగా ఉంటుంది.

ఈ డివైస్ 3 జీబి ర్యామ్ +32 జీబీ రూ.11,999, 4 జీబీ +64 జీబికి రూ.13,999. దీనిలో 4 జిబి RAM + 128 GB స్టోరేజ్ట్ తో మరో వేరియంట్ కూడా ఉంది, దీని ధర రూ.17,999. ఆనర్ 9N 4 GB RAM తో ప్యాక్ చేయబడింది మరియు 64 GB మరియు 128 GB వివిధ ఇంటర్నల్ స్టోరేజెస్ అనే రెండు వేరియంట్లను కలిగి ఉంది, మైక్రో SD కార్డును ఉపయోగించి డివైస్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ ని 256 GB వరకు ఎక్సపాండ్ చేసుకోవచ్చు. హానర్ 9N డిస్ ప్లే పైన అంచులో ఒక నొక్కు వస్తుంది.

స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ డివైస్ 5.84 అంగుళాల FHD + డిస్ ప్లే తో 19: 9 అస్పెక్ట్ రేషియో తో మరియు దాదాపు 79.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉంటుంది. ఆపిల్ సిరీస్ ఐఫోన్ X లాగానే ఈ ఫోనులో డిస్ప్లే పై    భాగంలో ఒక నొక్కు ఉంటుంది. వెనుకవైపు, డ్యూయల్ కెమెరా సెటప్ క్రింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది కూడా ఫేస్ అన్లాక్ ఫీచర్ తో వస్తుంది.

హానర్ 9 ఫ్యామిలీ కి చెందిన ఈ డివైస్, HiSilicon కిరిన్ 659 ఆక్టా కోర్ చిప్ సెట్ తో నడుస్తుంది. సాఫ్ట్ వేర్ పరంగా చెప్పాలంటే ఈ డివైస్ యొక్క సాఫ్ట్ వేర్ EMUI 8.0 ఆండ్రాయిడ్ 8.0 (ఒరీయో) ఆధారంగా ఉంటుంది.ఓవర్ ఆల్ గా ఈ డివైస్ 13 MP + 2 MP డ్యూయల్ కెమెరా సెటప్ వెనుకవైపు మరియు 16 MP సేల్ఫీ కెమెరా ముందు నొక్కు లోపల ఉంటుంది. ఇది ఒక బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్, బ్యాటరీ పరంగా ఒక మంచి 3,000 mAh బ్యాటరీ ప్యాక్. ఇది 152 గ్రాముల బరువును కలిగి ఉంది మరియు డ్యూయల్ నానో-సిమ్ తో జతచేయబడి ఉంటుంది. ఒక 3.5mm జాక్ ఫోన్ అడుగు వైపు ఉంటుంది. ఫోన్ బ్లూటూత్ 4.2, Wi-Fi 802.11 b / g / n, Wi-Fi డైరెక్ట్, హాట్ స్పాట్ మరియు ఒక మైక్రోయూఎస్ బి  2.0 పోర్ట్ కలిగి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఈ న్యూ స్మార్ట్ ఫోన్ ని కొని ట్రై చేయండి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button