telugu cinema reviews in telugu language

House Arrest Movie Review : హౌస్ అరెస్ట్ మూవీ హిట్ ఆ? ఫట్టా ఆ?

House Arrest Movie Review :సినిమా :- హౌస్ అరెస్ట్ (2021) నటీనటులు:- శ్రీనివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాశ్‌, ర‌విబాబు, తాగుబోతు ర‌మేష్, నిర్మాతలు:-  కె.నిరంజ‌న్ రెడ్డి , డైరెక్టర్ :- శేఖ‌ర్ రెడ్డి ఎర్రా

లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో శ్రీనివాస్ రెడ్డి , సప్తగిరి నటించిన హౌస్ అరెస్ట్ ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే హౌస్ అరెస్ట్ వచ్చింది. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

కథ :-

ఈ కథ దొంగలైనా సాంబ (శ్రీనివాస్ రెడ్డి) , జానీ (సప్తగిరి) , శ్రీశైలం (రఘు ) మరియు వారి స్నేహితుల మధ్య జరిగే సన్నివేశాలతో మొదలవుతుంది. వీరు దొంగతనాలే కాదు పిల్లల్ని కిడ్నప్ కూడా చేస్తుంటారు. ఒకానొక రోజు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్తారు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్ళికని ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి వెళ్తారు. ఈ విషయం దొంగలకు తెలియదు. పిల్లలు వీరిని చూసి ఎలాంటి ప్లాన్లు వేశారు ? దొంగలే భయపడేంత రేంజ్ లో ఎలాంటి పన్నాగాలు వేశారు? చివరికి దొంగల పరిస్థితి ఏంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.

👍🏻:-

  • కథ మరియు కథనం బాగున్నాయి. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి తమదైన కామెడీ టైమింగ్ తో అలరిస్తరు. మిగితా వారు కూడా బాగా చేశారు. పిల్లలైతే ఏకడ తగ్గకుండా వీరికి పోటీగా నటించారు.
  • దర్శకుడు తనదైన శైలితో బాగా తీశారు.
  • నిర్మాణ విలువలు బాగున్నాయి.
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్.
  • సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
  • సెకండ్ హాఫ్.
  • 👎🏻:-
  • ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు
  • పెద్దగా కామెడీ పండలేదు.

ముగింపు :-

మొత్తానికి హౌస్ అరెస్ట్ అనే సినిమా కథ మరియు కధనం పరంగా ప్రేక్షకులని కచ్చితంగా అలరిస్తుంది. కాకపోతే మొదటి భాగం లో వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అవి ఓర్చుకొని చూస్తూ సెకండ్ హాఫ్ లో అడుగు పెడితే బాగుంటుంది సినిమా. దర్శకుడు చాల బాగా రాసుకున్నారు మరియు తెరకేక్కిన్చారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మ్యూజిక్ సినిమా కి ప్రాణం పోసింది. మొత్తానికి ఈ వారం ఈ సినిమా ని కుటుంబం అంత కలిసి చూసేయచ్చు.

Rating:- 2.75 /5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button