Today Telugu News Updates

పాన్ కార్డు 2 రోజుల్లో ఎలా పొందాలి ? – how to apply pan card in telugu ?

how to apply pan card in telugu ?

how to apply pan card in telugu – సాధారణంగా Pancard డెలివరీకి 15 to 20 రోజుల సమయం పడుతుంది. అయితే NSDL వెబ్‌సైట్‌లో Pancard కి అప్లై చేసి 2 రోజుల్లోనే పొందే వీలుంది .

ముఖ్యంశాలు
ఆదాయపు పన్ను కట్టే వారికి ఇది తప్పనిసరి
ముఖ్యమైన గుర్తింపు ధ్రువీకరణ పత్రాల్లో పాన్ కార్డు ఒకటి
గతంలో లాగ పాన్ కార్డు కొరకు ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన పని లేదు,వేగంగా పొందే వెసులుబాటు మనకు అందుబాటులో ఉంది

Pancard అనగా (Perminent Account Number ) చాలా కీలకమైన గుర్తింపు ధ్రువీకరణ పత్రం. Income Tax శాఖ ఈ పాన్ కార్డు ని జారీ చేస్తుంది. Pancard పైన 10 డిజిట్స్ కలిగి ఉంటాయి. ఇందులో అక్షరాలు మారియు అంకెలు కలగలపి ఉంటాయి. అలాగే మనకి సంబంధిచిన వివరాలు మన పేరు, పుట్టిన రోజు , తండ్రి యొక్క పేరు వంటి వివరాలను కూడా కార్డు పైన చూడవచ్చు .

ఒక వ్యక్తి లేదా కంపెనీ ఎవరైనా సరే ఈ Pancard కోసం దరఖాస్తు చేయవచ్చు . ఈ మధ్య కాలంలో Pancard పొందటం చాలా సులభమైంది . ఆన్‌లైన్‌లో ఈజీగా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

లామినేటెడ్ రూపంలోని పాన్ కార్డు డెలివరీకి సాధారణంగా 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. అయితే NSDL వెబ్‌సైట్‌లో Pancard కు అప్లై చేసి 2 రోజుల్లోనే పొందొచ్చు.

NSDL వెబ్‌సైట్‌కు వెళ్లి ఫామ్ 49(A ) లేదా ఫామ్ 49(AA ) అప్లికేషన్ ఫిల్ చేసి తర్వాత ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్ చేసి వేగంగా Pancard పొందొచ్చు.

Pancard అప్లికేషన్ సబ్‌మిట్‌కు 3 ఆప్షన్లు అందుబాటులో ఉంచారు .
1> E – Kyc అండ్ E – sign (పేపర్‌లెస్),
2> E – sign ,
3>ఫిజికల్ డాక్యుమెంట్
అనే మూడు మార్గాలలో Pan అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయవచ్చు. E – Kyc అండ్ E – sign (పేపర్‌లెస్) కోసం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. E – sign ఆప్షన్‌లో వ్యక్తి యొక్క ఫోటో, సిగ్నేచర్ మరియు ఇతర డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫిజికల్ డాక్యుమెంట్ ఆప్షన్‌ కొరకు పాన్ అప్లికేషన్‌ను nsdl ఫార్వర్డ్ చేయాలి.

Pancard అప్లికషన్ జాగ్రత్తగా ఫిల్ చేయాలి . తప్పులు లేకుండా చూసుకోవాలి . అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత కొంత ఫీజుతో పాటుగా ఆన్‌లైన్‌లో సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది . ఫిజికల్ కార్డు పొందాలనుకుంటున్నారా? లేదంటే E-Pan కోరుకుంటున్నారో తెలియజేయవచ్చు.

అప్లికేషన్ సబ్‌మిట్ చేసాక మీకు 15 Digits అక్‌నాలెట్జ్‌మెంట్ number వస్తుంది. ఈ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. మీరు ఎంటర్ చేసిన వివరాలు ధృవీకరించిన తర్వాత 2రోజుల్లో పాన్ కార్డు వస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button