technology information

మీ స్మార్ట్ ఫోన్ లో ఫేక్ యాప్స్ ని డౌన్లోడ్ చేయకుండా అవైడ్ చేయడం 

నేటి స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండడం సర్వ సాధారణo. స్మార్ట్ ఫోన్ మీ చేతిలో ఉంటే ప్రపంచం అంతా మన గుప్పిట్లో ఉనట్టే. దానిలో ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే ఒరిజినల్ యాప్స్ . మరికొన్ని ఈ ఒరిజినల్ యాప్స్ కి ఫేక్ యాప్స్ . ఇవి ఫేక్ యాప్స్ అని తెలియక చాలామంది ఒరిజినల్ యాప్స్ కి బదులు వాటి యొక్క నకిలీ యాప్స్ ని  డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. ఈ నకిలీ యాప్స్ ని డౌన్లోడ్ చేయడం వలన తీవ్రమైన నష్టం కలిగే అవకాశo ఉంది. దీనివలన మీ ఫోన్ లో ఉన్న మీ వ్యక్తిగత సమాచారo దుష్టశక్తుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నిజమైన యాప్స్ ని మాత్రమే డౌన్ లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ నకిలీ యాప్స్ అన్ని చోట్ల ఉన్నాయి. కాబట్టి  నకిలీ యాప్స్ ని డౌన్ లోడ్ చేయకుండా ఎలా నివారించవచ్చు మరియు మీ స్మార్ట్ ఫోన్ లో హానికరమైన సాఫ్ట్ వేర్ ని ఎలా నిరోధించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  1. ఎల్లప్పుడూ అఫీషియల్ యాప్ స్టోర్స్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేయాలి

ఎల్లప్పుడూ  అఫీషియల్ స్టోర్ నుండి మాత్రమే యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇతర ప్లేసెస్ నుండి యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ ని మీరు ఎంపిక చేసుకోవచ్చు, కాని మీరు వీలైనంత వరకు ఎక్కువగా వాటిని అవైడ్ చేస్తే చాలా మంచిది. హానికరమైన యాప్స్ అఫిసియల్ స్టోర్స్ లో కూడా ఉండవచ్చు అయితే వాటిని వీలైనంత త్వరగా రిమూవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అఫీషియల్ స్టోర్స్ లో మాత్రమే యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటే నకిలీ యాప్స్ ని పొందడానికి ఉండే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది.

  1. యాప్స్ డిస్క్రిప్షన్ ని చదవండి

చాలా స్పెల్లింగ్ తప్పులు లేదా వ్యాకరణ తప్పులు ఉన్నాయో లేదో చూడండి? అంటే అది ఒక నకిలీ యాప్ అని చెప్పొచ్చు. ఒక విశ్వసనీయ డెవలపర్ ఇన్ని తప్పులను ఒక యాప్ కి ఉపయోగించడు. ఒకవేళ బేసిక్ డిస్క్రిప్షన్ మాత్రం తప్పుగా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా నకిలీ యాప్ అయ్యి ఉంటుంది.

  1. రివ్యూస్ చాలా ముఖ్యమైనవి

యాప్స్ ని డౌన్లోడ్ చేయడానికి ముందు ఆ యాప్స్ యొక్క కొన్ని రివ్యూస్ ని  చదవడంలో ఎలాంటి టైం వేస్ట్ అనుకోకూడదు. ఒకవేళ ఇది ఒక నకిలీ యాప్ అయ్యి ఉంటే దాని గురించి చెప్పే రివ్యూస్ కొన్ని ఉంటాయి. అందుకే ఈ యాప్ ని డౌన్లోడ్ చేయడానికి ముందు యాప్ గురించి ఇతరులు ఏమి రివ్యూ  చెప్పారో తెలుసుకోవడం మంచిది.

  1. డెవలపర్ బ్యాక్ గ్రౌండ్ ని బ్రీఫ్ గా చెక్ చేయాలి

యాప్ డెవలపర్ యొక్క వెబ్ సైట్ ని విసిట్ చేయాలి లేదా వాటి గురించి చదవండి. అనువర్తనం స్టోర్ వివరణ. అనువర్తనం డౌన్లోడ్ చేయడానికి ముందు, డెవలపర్ గురించి తెలుసుకోవడం మంచిది. మీరు ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే – వారికి వెబ్ సైట్ లేదా సామాజిక మెడా హ్యాండిల్ లేకుంటే – ఆ అనువర్తనం డౌన్లోడ్ చేయకుండా మీరు మెరుగైనవి.

  1. డౌన్ లోడ్ నెంబర్ చూడాలి

యాప్ ఒరిజినల్ లేదా ఫేకా అని తెలుసుకోవడానికి ఒక మంచి ఇండికేటర్. అధిక సంఖ్యలో డౌన్ లోడ్స్ ఉంటే  అది సాధారణoగా ఫేక్ యాప్ అని చెప్పలేము.

పైన చెప్పిన పాయింట్స్ అన్ని పూర్తిగా మీరు ఫేక్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోకుండా నివారించగలవు  అని కాదని గుర్తుంచుకోండి. ఏదేమైనా, ఒక యాప్ ని గుడ్డిగా లేదా ఎవరో చెప్పారని డౌన్ లోడ్ చేసుకోవడం కంటే పైన చెప్పిన వాటిని అనుసరించడం మంచిది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button