technology information

మీ టీవీ యొక్క ఆడియో క్వాలిటీని మెరుగుపరచుకోవడం ఎలా?

ఈ రోజుల్లో టీవీలు తయారుచేసే కంపెనీలు ప్రధానంగా వారి ప్రొడక్ట్స్ అడ్వాన్సడ్ ఇమేజ్ క్వాలిటీపై దృష్టి పెడుతున్నారు. దీనితోపాటు ఆడియో డిపార్టుమెంట్ కూడా గణనీయంగా అభివృద్ధి చెందింది.  అయినప్పటికీ, టెలివిజన్లలో చాలా వరకు సౌండ్ లో క్వాలిటీ ఇప్పటికీ స్పష్టoగా లేదు. కొన్ని మార్పులు మరియు నవీకరణలతో, మీ టీవీలో సౌండ్ క్వాలిటీని మెరుగుపరచుకోవచ్చు. మీరు టీవీలో సౌండ్ క్వాలిటీని మెరుగుపరచడానికి ఈ కింద చెప్పిన మెథడ్స్ ఫాలో అయితే చాలు.

మెథడ్ 1: టీవీ యొక్క ఈక్వలైజర్ మరియు ఆడియో సెట్టింగ్ తో ప్లే చేయండి.

సౌండ్ అవుట్ పుట్ పరంగా ఇది ఒక ప్రాథమిక మరియు ముఖ్యమైన అంశం. టీవీ యొక్క డిఫాల్ట్ ఆడియో సెట్టింగులు ఎల్లవేళలా మంచి సౌండ్ ఇవ్వలేవు, మీరు సాధ్యమయ్యే అవుట్ పుట్ పొందడానికి వాటిని కొంచెం మూవ్ చేసి ఉంచాలి.

మీ టీవీ మూవీ, మ్యూజిక్, గేమ్, వాయిస్, కస్టమ్, మొదలైనవి వంటి వేర్వేరు ఆడియో మోడ్స్ ఉంటే, మోడ్ ని మార్చడానికి ప్రయత్నించండి మరియు మీ అవసరానికి అనుగుణంగా ఉత్తమంగా సరిపోయే దాన్ని చెక్ చేసి యూస్ చేయండి. టీవీలో ఉన్న ఈ వేర్వేరు మోడ్స్  మీకు నచ్చకపోతే , కస్టమ్ మోడ్ కి మారండి మరియు ఈక్వలైజర్ ని మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సౌండ్ ఫ్రీక్వెన్సీ గురించి కొంచెం నాలెడ్జ్ కలిగి ఉండాలి.

  • బాస్ ని మేనేజ్ చేయడానికి, 20Hz నుండి 250Hz మధ్య ఫ్రీక్వెన్సీ స్లయిడర్ ని అడ్జస్ట్ చేయాలి.
  • వోకల్స్ మేనేజ్ చేయడానికి 250Hz నుండి 500Hz వరకు ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేయండి.

ట్రెబెల్ కోసం, మీరు 4KHz మధ్య 20KHz మధ్య ఫ్రీక్వెన్సీ స్లయిడర్స్ అడ్జస్ట్ చేయాలి.

మెథడ్ 2: టేబుల్ మౌంట్ స్టాండ్ మీద టీవీని ఉపయోగించండి.

టీవీలు డౌన్ వార్డ్ ఫైరింగ్ చేసే స్పీకర్లను కలిగి ఉoటే, టేబుల్ స్టాండ్ వాడితే అది శబ్దంతో  పాటు సౌండ్ ని పెంపొందించుకోవటానికి సహాయపడుతుంది. టేబుల్ సర్ఫేస్ టీవీ సెట్ నుండి వచ్చే సౌండ్ ని  బౌన్స్ చేస్తూ మరియు ఒక సరళమైన సౌండ్ ఎఫెక్ట్ ని యాడ్ చేయడానికి సహాయపడుతుంది.

మెథడ్ 3: TV తో ప్రత్యేక స్పీకర్ సిస్టమ్ ని ఉపయోగించండి

పైన చెప్పిన మెథడ్స్ ని ప్రయత్నించినప్పటికి మీరు సాటిస్ఫై అవకపోతే ఒక సౌండ్ బార్ లేదా ఒక సరౌండ్ సౌండ్ స్పీకర్ వంటి స్పీకర్ సిస్టమ్ ని యాడ్ చేయడం వల్ల ఖచ్చితంగా మీరు మీ TV లో ఆడియో క్వాలిటీని పెంచడానికి సహాయం చేస్తుంది. స్పీకర్లను కొనడానికి  ముందు మీ టీవీలో కనెక్టివిటీ ఆప్షన్ ని చెక్ చేయడం మంచిది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button