ఆనెలు వెంటనే తగ్గిపోవాలంటే..?
కార్న్.. తెలుగులో ఆనెలు అని పిలుస్తారు. ఇవి అరికాళ్లలోనూ, అరచేతిలోనూ, చేయి, కాళ్ల వేళ్లపైన మరియు వేళ్ల సందుల్లోనూ వస్తూ ఉంటాయి. సాధారణంగా మనం పనిచేసేటపుడు మన చేతి లేదా పాదాల ప్రదేశంలో అధిక ఒత్తిడి, రాపిడి పడినపుడు ఆ ప్రదేశ ఉపరితలంపై మృతకణాలు ఒక మందపాటి పొరలా తయారై, చర్మం పొలుసులుగా మారుతుంది. కాలక్రమంలో ఇది ఒక బొడిపెలా మారుతుంది.
నిమ్మకాయ: ఆనెలను తగ్గించడంలో నిమ్మకాయ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ లక్షణాలు ఆనెలను తగ్గించడంలో సహాయపడుతుంది.

బేకింగ్ సోడా: ఇది యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది మీ చర్మంపై ఏర్పడే పొక్కులను, మృతకణాలు చేరడం వలన గట్టిపడిన చర్మాన్ని తొలగిస్తుంది. బేకింగ్ సోడాను వాటర్‌లో కలిపి పేస్ట్‌లా చేసుకుని సుమారు 15 నిమిషాలపాటు ఆనెల మీద ఉంచాలి. తరువాత స్క్రబ్బింగ్ స్టోన్‌ను వాడి ఆనెల మీద రబ్ చేయాలి.
పైనాపిల్: పైనాపిల్ కూడా కార్న్‌ని తొలగించే ఒక అద్భుతమైన హోం రెమిడీ అని చెప్పవచ్చు. పైనాపిల్ తొక్కను చిన్న ముక్కగా కట్ చేసి గుజ్జు కలిగిన ప్రదేశాన్ని ఆనెలపై వేసి కట్టుగా కట్టుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన ఆనెల సమస్యను తగ్గించుకోవచ్చు.
వెల్లుల్లి: వెల్లుల్లి అద్భుతమైన యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇందులో ఉండే లక్షణాలు ఆనెలను సమూలంగా తొలగిస్తాయి.