health tips in telugu

నిమ్మకాయతో జుట్టును పెంచడం ఎలా..?

చౌకగా లభించే నిమ్మకాయలో మన జుట్టు పోషణకు అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసంలో విటమిన్‌ బి, సి, పాస్ఫరస్‌ పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టు డ్యామేజీ తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

వారంలో కనీసం ఒక రోజైన నిమ్మరసాన్ని జుట్టు కుదళ్లకు పట్టించి మృదువుగా మసాజ్‌ చేసుకుంటే జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి. జుట్టుకు నిమ్మరసం అప్లై చేయడం వలన కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే..

నిమ్మరసం, కొబ్బరినూనె కలిపి జుట్టుకు పట్టించి మృదువుగా మర్ధన చేయండి. సుమారు అరగంట తర్వాత చల్లని నీటితో తలస్నానం చేయండి. తరచుగా ఇలా చేయడం వలన జుట్టురాలడం, పలుచబడటం వంటి సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

పేల సమస్యతో బాధపడేవారు నిమ్మరసం, బాదం నూనె లేదా వేపనూనెను మిక్స్‌ చేసి తలకు పట్టించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

నిమ్మరసం తలలో ఏర్పడే అన్ని రకాల ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది. తలను కేశాలను శుభ్రంగా ఉంచుతుంది. జిడ్డు సమస్యను తగ్గిస్తుంది.

అంతేకాకుండా జుట్టుకు నిమ్మరసాన్ని పట్టించి, బాగా మసాజ్‌ చేయడం ద్వారా సహజంగానే చుండ్రు సమస్యను నివారించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button