technology information

వాట్సప్ గ్రూప్ కాలింగ్ ఫీచర్ ని ఎలా ఉపయోగించాలి?

ఇప్పుడు ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్స్. అందులో ప్రతిఒక్కరు ఉపయోగించే ఒక ముఖ్యమైన యాప్ వాట్సప్. ఇది అందరికి ఎంతగానో ఉపయోగపడే ఒక చాట్ మెసెంజర్. వాట్సప్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని యూసర్స్ కోసం అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో లేటెస్ట్ గా వచ్చిన ఒక కొత్త ఫీచర్ వాట్సప్ గ్రూప్ కాలింగ్. కొంతకాలం వాట్సప్ గ్రూప్ కాలింగ్ బీటా మోడ్ లో ఉంది. కంపెనీ చివరకు ఆండ్రాయిడ్ మరియు iOS డివైసెస్ (ఐఫోన్స్ / ఐప్యాడ్ ల) రెండింటిలో యాప్ యొక్క ఒరిజినల్ వెర్షన్ లో ఈ గ్రూప్ కాలింగ్ ని ప్రారంభించింది. ఈ ఫీచర్ తో, వినియోగదారులు ఒకే టైములో ఎక్కువ మందికి కాల్ చేయవచ్చు.

ఒకవేళ మీకు వాట్సప్ లో గ్రూప్ ఆడియో మరియు వీడియో కాల్స్ చేయడం తెలియకపోతే ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దీని కోసం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుండి లేదా యాప్ స్టోర్ నుండి వాట్సప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి.

ఇంటర్నెట్ కనెక్షన్ వర్క్ చేసేలా చూసుకోవాలి.

ఇప్పుడు వాట్సప్ ని ఉపయోగించి గ్రూప్ వీడియో కాల్ చేయడానికి, ముందుగా మీరు వన్-ఆన్-వన్ కాల్ చేసి, ఆపై పార్టిసిపెంట్స్ ని యాడ్ చేయాలి.

వాయిస్ గ్రూప్ కాల్ చేయడానికి:

  1. మీ హోమ్ స్క్రీన్ పై వాట్సప్ ఓపెన్ చేయండి.
  2. ఇప్పుడు మీరు కాల్ చేయాలి అనుకునే పార్టిసిపెంట్ ని సెలెక్ట్ చేసుకోండి.
  3. టాప్ రైట్ కార్నర్ నుండి వాయిస్ కాల్ బటన్ పై టాప్ చేయండి.
  4. ఒకసారి కాల్ కనెక్ట్ అయిన తర్వాత, టాప్ రైట్ కార్నెర్ లో ఉన్న యాడ్ పార్టిసిపెంట్ బటన్ ని టాప్ చేయండి.
  5. మీరు కాల్ కి మరొక పార్టిసిపెంట్ ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యాడ్ బటన్ పై టాప్ చేయండి.
  6. ఇప్పుడు, మీరు కాల్ కి ఎక్కువ పార్టిసిపెంట్స్ ని యాడ్ చేయాలి అనుకుంటే, తిరిగి పైన చెప్పిన పద్ధతిని రిపీట్ చేయండి.

గ్రూప్ వీడియో కాల్ చేయడానికి:

  1. హోమ్ స్క్రీన్ పై వాట్సప్ ఓపెన్ చేయండి.
  2. కాల్స్ టాబ్ ని ఓపెన్ చేసి మరియు బాటమ్ రైట్ కార్నర్ నుండి డయలర్ బటన్ ని హిట్ చేయాలి.
  3. ఇక్కడ, మీరు మీ మొదటి పార్టిసిపెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి మరియు వన్-ఆన్-వన్ వీడియో కాల్ ప్రారంభించడానికి వీడియో బటన్ పై టాప్ చేయండి.
  4. ఇప్పుడు, యాడ్ పార్టిసిపెంట్ ఆప్షన్ పై టాప్ చేసి మరియు మీరు కాల్ కి యాడ్ చేయాల్సిన రెండవ పార్టిసిపెంట్ ని సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్ పై టాప్ చేయండి.
  5. కాల్ కి ఎక్కువ మందిని యాడ్ చేయడానికి పైన చెప్పిన స్టెప్ ని రిపీట్ చేయండి.

కాని గ్రూప్ కాల్ లో మొత్తం నలుగురు పార్టిసిపెంట్స్ ని మాత్రమే యాడ్ చేయగలము.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button