టమాటాతో ఇలా ట్రై చేస్తే మీ ముఖం అందంగా తయారవ్వడం ఖాయం..
చర్మ సౌందర్యాన్ని పెంచే పోషకాలు టమాటో పుష్కలంగా కలిగి ఉంది. టమాటోలో మన సౌందర్యాన్ని పెంచే విటమిన్లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం, ఫైబర్‌ను టమాటో కలిగి ఉంది.
ఎండాకాలంలో చర్మంపై మృతకణాలు పేరుకుపోయి చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కొద్దిగా టమాటో గుజ్జు, పంచదారతో కలిపి మొహానికి రాసుకోవాలి. తరచూ ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
రంగు తక్కువ ఉన్నామనుకునే వారికి టమాటా ఒక్క చక్కని పరిష్కారం చూపుతుంది. టమాటా, తేనె మిశ్రమాన్ని ముఖంపై రాయడం వల్ల అందులో ఉండే పోషకాలు చర్మానికి మంచి టోన్‌ను తీసుకువస్తాయి.

టమాటా గుజ్జును తీసుకుని ఉదయాన్నే ఐస్‌క్యూబ్ ట్రేలో వేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఎండలో నుంచి ఇంటికి రాగానే ఈ టమాటో ఐస్‌క్యూబ్‌తో మృదువుగా మర్ధన చేసుకోవాలి. దీనివలన చర్మానికి స్వాంతన చేకూరుతుంది.
టమాటో గుజ్జు, కమలాపండు గుజ్జు, కీర రసాన్ని సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలిపి రాత్రి పూట ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన పిగ్మెంటేషన్ సమస్య చాలామటుకు దూరం అవుతుంది. ముఖఛాయ మెరుగవుతుంది.
చెంచా టమాటరసం, చెంచా శెనగపిండి, అర చెంచా నిమ్మరసం కలిపి కళ్ల చుట్టూ రాసుకోవడం వలన కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలు తగ్గిపోతాయి.