technology information

HTC ఫోన్.. ధర కేవలం రూ.9 వేల లోపే:-

తైవాన్ కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపనీ హెచ్ టీసీ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కాకముందే సేల్ కు రెడీ అయింది . అదే హెచ్ టీసీ వైల్డ్ ఫైర్ ఈ2 స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ను రష్యాకు చెందిన ఆన్ లైన్ రిటైల్ సంస్థ తన వెబ్ సైట్ లో సేల్ కు ఉంచింది. దీనిలో వాటర్ డ్రాప్ తరహా డిస్ ప్లే, వెనకవైపు 2 కెమెరాలు ఉన్నాయి.

ప్రధాన కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ కాగా, మరో 2 మెగా పిక్సెల్ కెమెరాను కూడా ఇందులో అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయగలుగుతుంది .

ఇందులో 6.21 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను మరియు డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ వెనక వైపున అందించారు.
4 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ ను అందించారు అదేవిదంగా మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా మరో 128 జీబీ పెంచుకోవచ్చు.మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే సంగతి తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button