అక్కడ 65 ఏళ్ల వారుకూడా 25ఏళ్ల లా కనిపించే హుంజా తెగ … ఏంటి ఆ సీక్రెట్ !
Hunza tribe మన దేశంలో రకరకాల తెగల వారు ఉన్నారు, కానీ మిగితా తెగల వారితో పోల్చితే ఈ హుంజా తెగకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ తెగకు సంబందించిన వారు సగటు ఆయుర్దాయం 100 కు పైనే ఉంటుంది.
ఈ తెగవారు ఏకంగా 165 ఏళ్ళు జీవించినవారు ఉన్నారు. అంతేకాదు వీరికి ఎంత వయసు వచ్చిన యవ్వనంగానే కనిపిస్తారు.

వీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో గిల్గిట్ – బాల్టిస్థాన్ పర్వత ప్రాంతాల్లో జీవిస్తూఉంటారు. వీరు నివసించే గ్రామాలని ఒయాసిస్ అఫ్ యూత్ అని పిలుస్తారు.
ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, హుంజా తెగ మహిళలు 65 ఏళ్ళు దాటినా పిల్లల్ని కంటూ ఉంటారు. ఈ తెగవారు ఎక్కువగా ఆఫ్గనిస్తాన్ , చైనా,పాకిస్థాన్, ఇండియా సరిహద్దులలో నివసిస్తారు.

వీరి జనాభా 87 వెలగా ఉంది. వీరికి అనారోగ్య సమస్యలు అంటే తెలువదనే చెప్పాలి. వీరు అతి తక్కువగా అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు.
ఎందుకంటే ఈ తెగవారు నివసించే ప్రాంతాల్లో ఉష్ణోగ్రత చాల తక్కువగా ఉంటుంది. అదేవిదంగా వీరు స్వయంగా ఎలాంటి పంటకు సంబదించిన మందులు వాడకుండానే వీరి వ్యవసాయ విధానాలు ఉంటాయి. అందుకనే వీరి ఆహారం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది.

అదే విదనగా వీరు రోజు వారి అవసరాల నిమిత్తం 15 నుండి 20 కిలోమీటర్ల వరకు నడుస్తువుంటారు.
వీరి మోహంలో కూడా ఎప్పుడు చిరునవ్వు ఉండడం వల్ల వీరు నిత్య యవ్వనంగా కనిపిస్తూవుంటారు.