Wine Bath Tub: మందు టబ్ లో స్నానం చేయాలనుందా… ఐతే బ్రిటన్ వెళ్లాల్సిందే !

మోహన్ బాబు ‘కొదమ సింహం’ సినిమాలో తన స్టేటస్ ని చూపించడానికి తాను తాగే వైన్ టబ్ లో స్నానం చేస్తాడు. ఇలాంటివి నిజజీవితంలో ఎవరు ఊహించరు. కానీ ఇలాంటి ఆఫర్ ని బ్రిటన్ కి చెందిన ఒక సంస్థ అందిస్తుంది.
ఒక Spa తన వినియోగదారుల ఆకట్టుకోడానికి కొత్త తరహా ఆలోచన చేసింది. స్పా కోసం వచ్చే కస్టమర్లకు కిక్కెకించే పనిలో పడింది. ఈ అఫర్ ని క్రిస్మస్ సందర్భంగా తన వినియోగదారులకు ఈ అఫర్ ని ప్రకటించింది.
మాములగా స్పాలలో వేడి వాటర్ తో లేదా ఏవైనా రసాయానాలను కలిపో మసాజ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక సంస్థ 1000 లీటర్ల Wine Bath Tub ఏర్పాటు చేసింది. ఆ వైన్ ని 37 డిగ్రీల వరకు వేడి చేసి కస్టమర్లకు స్నానం చేసే ఒక ఛాన్స్ ని ఇస్తున్నారు.
ఈ టబ్ లో స్నానం వల్ల అనారోగ్యాలు కూడా నయమవుతాయని సంస్థ వారు చెబుతున్నారు. ఈ స్నానానికి ఆ సంస్థవారు 60 యూరోల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 6 వేలు) వసూల్ చేస్తున్నారు.
క్రిస్మస్ సందర్భంగా మా కస్టమర్లకు వినూత్న సేవలను కల్పించాలనే ఆలోచనతో దీనిని ప్రారంభించారమని స్పా వాళ్ళు తెలిపారు.