health tips in telugu
Health Benefits of Ajwain: చిటికెడు వాముతో.. ప్రయోజనాలెన్నో..
మన ఇంట్లో ఉన్న పోపు డబ్బాల్లో తప్పకుండా ఉండే వస్తువు వాము. దీని వల్ల అనేక ఉపయోగలున్నాయి. వాముకు ఔషద గుణాలు కూడా ఎక్కువే. వాము ఉపయోగాలను ఒకసారి పరిశీలిస్తే..
వామును వేడి నీటితో కలిపి తీసుకోవడం వల్ల విరేచనాలను తగ్గించవచ్చు.
వామును దోరగా వేయించి కొద్దిగా ఉప్పను కలిపి చూర్ణంగా తయారు చేసి రోజూ కొద్దిగా పిల్లలకు ఇవ్వడం వల్ల అజీర్ణతత్వం తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది.

వాము ఆకలిని పెంచి కడుపులో రోగాలను పోగొట్టే గొప్ప ఔషదంగా చెబుతారు.
ముక్కు దిబ్బడ వేసినపుడు వాముపొడిని వాసన చూస్తే దిబ్బడ వదిలిపోతుంది.
టీబీ, న్యూమెనియా లాంటి ఊపిరితిత్తుల వ్యాధులకు వాము ఎంతగానో ఉపయోగపడుతుంది.