IndvsAus: భారత్ దెబ్బకు… కంగారులు ఫసక్

ఆసీస్-ఇండియా టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, ఇషాంత్, బూమ్రా, అశ్విన్, ఉమేష్, షేమి వంటి భారత క్రికెటర్లు గాయాల కారణంగా దూరమయ్యారు.దీంతో జట్టు లో ఉన్నవారందరూ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని యువ క్రికెటర్ లే… వీళ్ళందర్నీ చూసి మొదట ఈ కుర్రకారులు కంగారు లపై ఎలా గెలుస్తారని కొందరు కామెంట్లు చేశారు.

ఇవన్నీ వారు లెక్కచేయకుండా.. ఆ జట్టులో ఉన్న భారత క్రికెటర్లు తమ ఆట ప్రదర్శనతో… కంగారు లకే కంగారు పెట్టించారు. ఆసీస్ ఇండియాపై5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా… ఆ లక్ష్యాన్ని భారత చేదించడం కష్టమని అనుకునే సమయంలో… టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 89 పరుగులు చేసి భారత్ కి విజయాన్ని అందించాడు

ఈ మ్యాచ్ లో గిల్ (91), పుజారా (56), రహానే 24, రిషభ్ పంత్ (89), వాషింగ్టన్ సుందర్ (23) పరుగులు చేశారు. 32 ఏళ్ల సంవత్సరాల తర్వాత ఆసీస్ కి ఓటమి రుచిని మన టీమిండియా క్రీడాకారులు చూపించారు. ఇండియాకు చరిత్రాత్మక విజయన్ని అందించిన టీమిండియా క్రికెటర్లపై పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంశలు కురిపిస్తున్నారు
