TikTok పరిచయం… కాస్త ఆ అమ్మాయిని తిప్పలు పెట్టింది… ఎలాగంటే…!

టిక్‌టాక్ ద్వారా పరిచయం అయిన అబ్బాయి ఆ అమ్మాయిని ఇబ్బందులకు గురిచేశాడు. అమ్మాయిని , ఆ వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేయడంతో తాను పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాజధాని హైదరాబాద్ కి చెందిన కొమ్మగోని కల్యాణ్ గౌడ్ ఒక కారు వాషింగ్ సెంటర్‌లో పని చేసుకొనే వ్యక్తి. ఇతడు టిక్‌టాక్ యాప్ ను అతిగా వాడేవాడు , ఇలా వాడుతున్న సమయంలో యాప్ లో ఒక యువతిని ఫాలో అయ్యాడు. ఆమె టిక్ టాక్ యాప్ లో అప్ లోడ్ చేసిన పోస్ట్‌లకు లైక్‌లు చేస్తూ.. ఉండగా ఒక సందర్భంలో ఆ యువతి కళ్యాణ్ కి కంటపడింది.
ఇక కళ్యాణ్ ఊరుకుంటాడా , ఆ అమ్మాయితో కలిసి మాట్లాడాడు, ఆ పరిచయం కాస్త ఫోన్ నంబర్స్ తీసుకొనెండదూరం వెళ్ళింది. ఇక అప్పటినుండి వాట్స్ అప్ చాట్ లు, మొదలయ్యాయి. అదేవిదంగా ఆ యువతి కాలేజ్ కి వెళ్లి మరింత పరిచయం పెంచుకొని , వీరి స్నేహం చాల బలంగా తయారైంది.
కొన్ని రోజులతరువాత స్నేహం ముసుగులో కళ్యాణ్ ఆ యువతికి తన ప్రేమను తెలియజేసాడు. దీనికి ఆ యువతినుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఆ యువతికి పెళ్లి జరిగే సందర్భం వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్ ఆ అమ్మాయిని తనతో దిగిన ఫోటోలను షోషల్ మీడియాలో పెట్టి అమ్మాయి పరువు తీస్తానని బెదిరించాడు.
అప్పటికే ఎంతో ఓపిక పట్టిన యువతి , కళ్యాణ్ మారకపోవడంతో ఆ యువతి రాచకొండ సైబర్ క్రైం పోలీసుల వద్ద కేసు పెట్టింది. పోలీసులు నిందితుడు కళ్యాణ్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. అదేవిదంగా ఆ అమ్మాయిని ముఖపరిచయంలేని వారితో స్నేహం ఏంటి , అలాగే ఒంటరిగా ఒక అబ్బాయితో ఫోటోలు ఎందుకు దిగావ్ అని మందలించి పంపించేశారు.