GossipsTollywood news in telugu

Is Bunny Icon Movie Shelved : బన్నీ ఐకాన్ సినిమా ఆగిపోయిందా ? :-

Is Bunny Icon Movie Shelved

Is Bunny Icon Movie Shelved : ఎపుడో లాక్ డౌన్ ముందు అల్లుఅర్జున్ మరియు వేణు శ్రీరామ్ కలిసి దిల్ రాజు గారి నిర్మాణంలో ఐకాన్ అనే సినిమా తియ్యబోతున్నారు అని అధికారికంగా ప్రకటించారు. కానీ బన్నీ కి పుష్ప సినిమా కమిట్మెంట్ ఉండడం తో ఐకాన్ సినిమా ముహూర్తం పోస్ట్ పోన్ జరిగింది.

దానికి తోడు కరోనా కేసులు రావడం , లాక్ డౌన్ పడుతూ ఉండడం తో ఇంతవరకు బన్నీ పుష్ప తోనే బిజీ ఉన్నారు. ఈ గ్యాప్ లో శ్రీరామ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో వకీల్ సాబ్ అనే సినిమా తీసేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన విషయం అందరికి తెలిసిందే.

ఇప్పుడు వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ అవ్వడం తో మరల ఇన్ని నెలలకు ఐకాన్ సినిమా ప్రస్తావన బయటకు వచ్చింది. వేణు శ్రీరామ్ మరియు దిల్ రాజు గారు కలిసి చెప్పకనే చెప్పారు ఐకాన్ సినిమా ఆగిపోలేదు. కచ్చితంగా షూట్ చేస్తాం అని వెల్లడించారు. అయితే ఇన్నిరోజులు బన్నీ పుష్ప షూటింగ్ పూర్తయ్యాక ఐకాన్ సినిమా షూటింగ్ చేయబోతున్నారని అందరు అనుకున్నారు , చిత్రబృందాలు కూడా చెప్పారు.

అయితే ఎవరు ఊహించని విధంగా మరల ఐకాన్ సినిమా బృందానికి షాక్ కలిగింది. అదేంటంటే బన్నీ పుష్ప షూటింగ్ పూర్తిచేసుకున్నాక వేణు శ్రీరామ్ తో కలిసి ఐకాన్ సినిమా షూటింగ్ కాకుండా బోయపాటి తో కలిసి యాక్షన్ లోడెడ్ మాస్ ఫిలిం చేయబోతున్నారని చిత్రసీమలో టాక్ విపరీతంగా నడుస్తుంది.

దీనివల్ల బన్నీ ఐకాన్ షూటింగ్ చేయడానికి ఎందుకు దూరం పెడుతున్నారు అనే వార్తలు అభిమానులలో మరియు సదరు సినిమా ప్రేమికులకు అనుమానాలు చెలరేగుతున్నాయి. దీనిపైనైనా బన్నీ కానీ వేణుశ్రీరాం కానీ దిల్ రాజు గారు కానీ క్లారిటీ ఇయ్యాలి. లేదంటే అనుమానాలతో ఈ సినిమా షూటింగ్ జరగదేమో అనే వార్తలకి దారి తెస్తుంది.

చూడాలి మరి బన్నీ పుష్ప షూటింగ్ చేసాక ఐకాన్ చేస్తారో లేదా బోయపాటి తో చేతులు కలిపి సినిమా తీస్తారో వేచి చూడక తప్పదు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button