Today Telugu News Updates

ధోనికంటే గంగూలీనే ఎంతో గొప్ప అని డైరెక్ట్ గా చెప్తున్న క్రికెటర్ !

IS Ganguly better than dhoni ? ధోని కంటే గంగూలీ నే గొప్ప అంటే మెజారిటీ జనాలు అవుననే అంటారు , ఎందుకంటే గంగూలీ అటు బ్యాటింగ్ లో దిగ్గజం , ఇటు క్యాప్టెన్సీ అంటే ఇలా దూకుడుగా ఉండాలి , అటు ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ కి రివర్స్ స్లెడ్జింగ్ నేర్పింది గంగూలీనే . అంతగా ఫాస్ట్ బౌలర్లు లేకున్నా , నలుగురు బ్యాటమెన్స్ మించి ఎవరు పరుగులు చేయలేకున్నా ఉన్న సమయంలో సిరీస్ లని గెలిపించి చూపించిన యోధుడు , గంగూలీ ఉన్న సమయంలోనే యువరాజ్ , ఇర్ఫాన్ పఠాన్ , సెహ్వాగ్ , గంబీర్ లాంటి మేటి క్రికెటర్లని తీసుకొచ్చి , పంట చేత్తుకొచ్చే సమయంలో భుసామి మారినట్టు , గంగూలీ తయారుచేసిన టీం గెలుపు బాట పట్టిన సమయంలో ధోని చేతికి కెప్టెన్సీ పగ్గాలు అందాయన్నది ఎవరు కాదనలేని సత్యం.

దీనికి అనేక కారణాలు లేకపోలేదు గంగూలీ బ్యాటింగు లో కొన్నిరోజులు ఫామ్ లో లేకపోవటం కారణం అయితే , కానీ అపుడే తనకు విలన్ గా మారిన కోచ్ గ్రెగ్ ఛాపెల్ రావటం క్యాప్టాన్సీ పగ్గాలతో పాటు టీం కి కుడా దూరం చేయటం , అపుడపుడే వస్తున్న ధోని బ్యాట్సమెన్ గా ఇటు వికెట్ కీపర్గా ప్రూవ్ చేసుకోవటం జరిగే సరికి ఇక అలా గంగూలీ క్యాప్టెన్సీ కి పూర్తిగా దూరం అవటం జరిగింది .

అయితే గంగూలీ కి ఆమాత్రం స్వేచ్చ ఇచ్చి ఇంకొన్ని ఛాన్సులు ఇవ్వొచ్చు , ఎలాంటి సాధారణ బ్యాట్సమెన్ కి ఐన ఆ మాత్రం ఛాన్సులు ఇచ్చిన సందర్భాలు చూసాం , కానీ కోచ్ తో వివాదాలు గంగూలీ టీం కి దూరం కావటం ఒక కారణం.

అయితే ధోని కుడా బాటింగ్లో విన్నింగ్ మూవ్మెంట్ లో భాగస్వామిగా ఉంటూ , ఇటు మిస్టర్ కూల్ కెప్టెన్ గా ఇండియన్ టీం కి రెండో ప్రపంచ కప్ తెచ్చిన ఘనత ధోని సొంతం అయితే ధోని ఎన్ని గెలుపులు అందించిన వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే గంగూలీకె మెజారిటీ జనాలు మొదటి ఓటు వేస్తారు , ఈ విషయం సహా క్రీడాకారులు కుడా ఇప్పటికి గంగూలీ పేరు చెప్పటం ఆశ్చర్యం కలగక మానదు .

ఆ లిస్టులో సెహ్వాగ్ , గంబీర్, యూసుఫ్ పఠాన్ , యువరాజ్ సింగ్ , ఇలా చాలా సహచరులు గంగూలీ వైపే మొగ్గు చూపటం గంగూలీ కి ఇప్పటికి ఉన్న మాస్ ఫాలోయింగ్ తెలుపుతుంది , ఇదే లిస్టులో ఇపుడు పార్థివ్ పాటిల్ కుడా చేరాడు , ధోని టీం ని గెలిపిస్తే గంగూలీ అదే టీం ని నిర్మించాడు అని తెలిపాడు , అందుకే ఎలాంటి సందేహం లేకుండా గంగూలీనే నా ఫేవరెట్ ఇద్దరిలో అన్నాడు .

వీరిద్దరిలో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ లో తెలుపండి

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button