Is Jai Balayya title of NBK 107 : బాలయ్య బాబు సినిమా టైటిల్ జై బాలయ్య ? :-

Is Jai Balayya title of NBK 107 : హెడ్డింగ్ చదివి షాక్ అయ్యారా , అయ్యే ఉంటారులెండి. ఎందుకంటే జై బాలయ్య అనే పదం లో ఉన్న పవర్ , సాటిస్ఫాక్షన్ అటువంటిది మరి. థియేటర్లో ఏ హీరో సినిమా ప్రోజెక్ట్ అయినా జై బాలయ్య అనే వాయిస్ కచ్చితంగా వినబడుతుంది. ఆ పదం కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే బాలయ్య బాబు ఇదివరకే అఖండ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని తన తదుపరి సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు సిద్ధం అయ్యారు.వరుసగా సినిమాలు లైన్ లో ఉన్న బాలయ్య అఖండ తర్వాత అభిమానులకి క్రాక్ లాంటి మాస్ బిర్యానీ తినిపించే డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం లోనే సినిమా చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.
మ్యాటర్లోకి వెళ్తే గోపీచంద్ మలినేని దర్శకత్వం లో బాలయ్య బాబు చేసే సినిమాకి వర్కింగ్ టైటిల్ గా జై బాలయ్య అని పెట్టుకున్నట్లు చిత్రసీమ లో టాక్ విపరీతంగా నడుస్తుంది.
గోపీచంద్ మలినేని సినిమాలు అటు మాస్ ఆడియన్స్ కి మరియు సాధారణ ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటాయి. క్రాక్ సినిమా కూడా అలాగే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇపుడు బాలయ్య బాబు తో చేసే జై బాలయ్య సినిమా కూడా మాస్ రీలోడెడ్ అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు.
ఏదేమైనా ఇంకా ఈ కాంబినేషన్ లో చేసే సినిమా కి సంబందించిన టైటిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జై బాలయ్య అనే వర్కింగ్ టైటిల్ ఏ టైటిల్ గా ఫిక్స్ అయితే అభిమానులకే కాదు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కి కావలసినంత క్రేజ్ టైటిల్ తోనే తెచ్చిపెట్టేస్తుంది. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఏ రేంజ్ లో ట్రీట్ ఇయ్యబోతున్నారో.