Is Nag and Chay Joining the Sankranthi Race : సంక్రాంతి బరిలో నాగార్జున మరియు చైతన్య రాబోతున్నారా ? :-

Is Nag and Chay Joining the Sankranthi Race : 2022 సంక్రాంతి కానుకగా చాల పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నా విషయం మనందరికీ తెలిసిందే. ముందుగా రాజమౌళి గారి సినిమా ఆర్.ఆర్.ఆర్ తో సంక్రాంతి యుద్ధం బాక్స్ ఆఫీస్ వద్ద మొదలవబోతుంది.
అయితే ఇన్నిరోజులు సంక్రాంతి కానుకగా వచ్చే సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా నటించిన భీమ్లా నాయక్ జనవరి 12 న విడుదలకు సిద్ధం చేసారని ఎప్పటినుంచో ప్రచారం చేసారు , చేస్తున్నారు కూడా. దీనికి తోడు జనవరి 14 న ప్రభాస్ రాధేశ్యామ్ రాబోతుంది.
ఇంకా మహేష్ బాబు సర్కార్ వారి పాట చిత్రం కన్ఫర్మేషన్ ఇయ్యలేదు కానీ ఈ సినిమా కూడా జనవరి 13 న రాబోతుంది అని గతం లో ఈ చిత్రబృందం ప్రచారం చేశారు. ఇలా సంక్రాంతికి బరిలో ఇన్ని పెద్ద పెద్ద సినిమాలు అందులోనూ ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఒక్కరోజు గ్యాప్ తో.
ఎలాగో ప్రతి ఏడాది సంక్రాంతి అంటే 3,4 సినిమాలు పోటాపోటీగా విడుదల చేస్తారు అని అందరు సైలెంట్ అయిపోయారు. కానీ రాజమౌళి గారు ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించి అందరిని ఎలా షాక్ కి గురిచేశారో ఇపుడు నాగార్జున మరియు నాగ చైతన్య కలిసి అదే రేంజ్ లో షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.
మ్యాటర్లోకి వెళ్తే అక్కినేని నాగార్జున మరియు నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా బంగార్రాజు. ఈ సినిమా మొదటి భాగం అదేనండి సోగ్గాడే చిన్నినాయనా సినిమా సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇపుడు కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారని తెలుస్తుంది.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న బంగార్రాజు సినిమా షూటింగ్ చివరి దర్శలో ఉందని , ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగబోతుందని , అదికూడా జనవరి 15 న విడుదల అవ్వబోతుందని చిత్రసీమలో టాక్స్ మొదలయ్యాయి. త్వరలో ఈ విషయం పై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయబోతున్నారు అని తెలుస్తుంది.
చూడలి మరి సంక్రాంతి బరిలో నాగార్జున గారు కూడా దిగడం తో బాక్స్ ఆఫీస్ హీట్ మరింత పెరగబోతుందనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. అసలే సోగ్గాడు కి ఫాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ దానికితోడు ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఎక్కువ. వేచి చూడాలి ఎం జరగబోతుందో.