ఆర్జీవీ సినిమాలో నటించిన తరవాతే నా లైఫ్ లో కష్టాలు మొదలయ్యాయి …. ఒక హీరోయిన్ ఆవేదన !

tejaswi madivada : తేజస్వి మడివాడ తన కెరీర్ ని క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలుపెట్టి, కొంత కాలంలోనే హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది.
ఈ భామ సినిమాలు తక్కవే చేసినప్పటికీ తన గ్లామర్ షో లతో షోషల్ మీడియాని ఒక ఊపుఊపింది. అందుకనే ఈ అమ్మడుకు ఫాలోవర్లు కూడా అదే రేంజ్ లో ఉన్నారు. అందాల ప్రదర్శనకు ఓకే చెప్పినా తనకు సినిమా అవకాశాలు రావట్లేదని తెలిపింది.
సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ మీద అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయని, నార్త్ అమ్మాయిలు కమిట్మెంట్ లకు ఒప్పుకోవడం వలన వారిని హీరోయిన్స్ గా అవకాశాలు ఇస్తున్నారని , తెలుగు అమ్మాయిలు టాలెంట్ ఉన్నకమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా లేక అవకాశాలు ఇవ్వడం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టింది.
తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, అతనినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానంటే అలాంటి పనులు చేసి ఉంటానని అనుమానం పెంచుకుని నా ప్రేమకు బ్రేకప్ పడిందని తెలిపింది.