డిసెంబర్ లోగ ఇది చెల్లించండి …లేదంటే రూ.5000 ఫైన్ !
1. ఈ ఆర్థిక సంవత్సరానికి అనగా 2019-2020 సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్-ITR ఫైల్ చేసారా? వెంటనే చేయండి లేదంటే ఈ డిసెంబర్ 31, 2020 తరవాత రూ.5000 ఫైన్ కట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పలుమార్లు చివరి తేదీని పొడిగిస్తూ పోయింది.

2. ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ తేదీ ని పొడిగించే అవకాశం లేదు కాబట్టి ITR ని ఎట్టి పరిస్థితులలో ఫైల్ చేయాల్సిందే. లేకపోతే జనవరి 1,2021 నుండి అధిక పెనాలిటీని చెల్లించాల్సి వస్తుంది. ఈ పెనాలిటీ రూ. 10,000 వరకు వెళ్లొచ్చు అని డిపార్ట్మెంట్ తెలియజేసింది.

3. ఇప్పటికే చాలామంది ఐ టి ఆర్ ని ఫైల్ చేయలేదు. గడువు ఇంకా నాలుగు రోజులే ఉందని , చివరి రోజు 31 నాడు చేస్తే సాంకేతిక సమస్యలు రావచ్చు , అందుకనే ఈ రోజే https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్‌సైట్‌లో ఫైల్ చేయండని టాక్స్ డిపార్ట్మెంట్ ప్రజలను కోరింది.