Rocket ragava 400 ఎపిసోడ్ లో 400 స్కిట్లు వేసిన రాకెట్ రాఘవ…
jabardasth Rocket ragava : బుల్లితెరలో మొదటి కామెడీ షో “జబర్దస్త్”.. ఏడున్నర ఏళ్లుగా ప్రేక్షకులను మల్లెమాల ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంది. ఇప్పటి వరకూ నాలుగువందల ఎపిసోడ్లు జరిగాయి. అందులో ఎందరో యాంకర్లు, టీం లీడర్లు చివరికి జడ్జిలు కూడా మారారు.కానీ ఒకే ఒక్క టీమ్ లీడర్ మల్లెమాల నిర్వహించిన 400 ఎపిసోడ్లో 400 స్కిట్లు చేశారు..

ఇంతకీ అతను ఎవరో కాదు రాకెట్ రాఘవ.. ఇతడు చూడడానికి చిన్న గా ఉంటాడు..కావచ్చు కానీ అతని పంచులు పెద్దగా పేలుతాయి.. ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా విరామం తీసుకోకుండా నిర్విరామంగా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే అంత సులభం కాదు.టీమ్ లీడర్స్ అయిన చమ్మక్ చంద్ర, ధన్ రాజ్,వెంకీ లు కూడా పలు సినిమాల్లో నటిస్తూ జబర్దస్త్ కి విరామం ఇచ్చారు. కానీ రాఘవ కి ఎన్ని ఆఫర్లు వచ్చినా జబర్దస్త్ కోసం వదులుకున్నాడు. ఇటు సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ..అట్టు జబర్దస్త్ తో ప్రేక్షకులను నవ్వించడం అది ఒక్క రాఘవ తోనే సాధ్యమవుతుంది. ఈ ఘనత సాధించిన రాఘవ ను జడ్జి రోజా, మల్లెమాల ప్రొడక్షన్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు…
