Tollywood news in telugu

Jai Bheem Creating huge controversies : ఇబ్బందులో చిక్కుకున్న సూర్య జై భీమ్ :-

jaibheem
Jai Bheem Creating huge controversies

Jai Bheem Creating huge controversies : అవును మీరు చదివింది నిజమే. సూర్య జై భీమ్ సినిమాలో ఒక్క సన్నివేశం ఇబ్బందులు మరియు వివాదాలకు దారి తీసింది. నవంబర్ 2 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే సినిమా విడుదల అయినా రోజే ఈ వివాదాలు మొదలయినప్పటికీ ఇప్పుడు మరింత తీవ్రత కి గురయింది. ఇంతకు ఆ సీన్ ఏంటని అనుకుంటున్నారా.

మ్యాటర్లోకి వెళ్తే సూర్య జై భీమ్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక్క బంగారు శేట్ (వ్యాపారి) హిందీ లో మాట్లాడుతుంటే అతని చెంపమీద కొట్టి తమిళం లో మాట్లాడు అని చెప్పే సన్నివేశం. ఆ సీన్ పైనే ఇప్పుడు హిందీ భాషని ఎందుకలా చూపించారు అని సినిమాని వ్యతికరిస్తూ సోషల్ మీడియా లో హుల్ చల్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మిగితా సభ్యులు ఆ సీన్ ని వివరిస్తూ ముందు సినిమా చుడండి. ఎందుకు ప్రకాష్ రాజ్ కొట్టాడో క్లారిటీ వస్తది అంతే కానీ సినిమా చూడకుండా ఇలా చెయ్యడం బాగోదు అని చెప్పారు.

సినిమాలో ప్రకాష్ రాజ్ కేసు ని పరిశీలించే సమయం లో ఆ షాప్ వాడు హిందీ లో తడబడి తడబడి మాట్లాడుతుంటే కొట్టి నిజం రప్పించాడు అంటే కానీ ఏ భాషను కించపరచాలని ఉద్దేశమే లేదు అని సినిమా చుసిన వాళ్లకి అర్ధం అవుతుంది. చూడాలి మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button