Jai Bhim Movie Review | జై భీమ్

Movie Name : Jai bhim
Cast : – Surya, Rajisha Vijayan, Prakash Raj, Rao Ramesh etc.
Producers : – Surya Shiva Kumar
Music Director : Sean Roldan
Director : – Gnanavell Tha Se
- ముఖ్య గమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పల్బడితే తగ్గినా చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people
Story (Spoiler Free ) :-
ఈ కథ గిరిజన దంపతులు అయినా రాజన్న (మణికందన్) మరియు చిన్నతల్లి (లిజోమల్ జోస్) చుట్టూ తిరుగుతుంది. చిన్నతల్లి గర్భవతి. కొని అనుకోని సంఘటనల చేత సంపన్నుడి ఇంట్లో ( రిచ్ పీపుల్ హౌస్ ) దొంగతనం జరుగుతుంది. ఎటువంటి అధరాలు లేకుండా పోలీసులు రాజన్న ని మరియు అతని భార్య ఏ ఈ దొంగతనానికి కారకులు అని అరెస్ట్ చేసుకొని కేసు ఫైల్ చేస్తారు.
రాజన్న ని పోలీసులు తీసుకొని పోయారని చిన్నతల్లి బాధపడుతున్న సమయం లో అనుకోకుండా ఒక వార్త ‘ రాజన్న జైలు నుంచి తప్పించుకొని పరారయ్యాడు ‘. వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న చిన్నతల్లి మరింత మనస్థాపానికి లోనయి వేరేదారి లేక నిజాయితీ గల లాయర్ చంద్రు(సూర్య)ని సంప్రదించింది.
ఇప్పుడు చంద్రు ఈ కేసు ని ఎలా సాల్వ్ చేయబోతున్నాడు ? ఇంతకీ రాజన్న ఎందుకు జైలు నుంచి పరారయ్యాడు ? అస్సలు సంపన్నుడు ఇంట్లో దొంగతనం చేసింది ఎవరు ? ఈ కేసు గిరిజనుల పైనే ఎందుకు వేశారు ? గర్భవతి అయినా చిన్నతల్లి బాధలను ఎదుర్కొని చంద్రు సహాయం తో ఎలా పోరాడింది. ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూసేయాల్సిందే.
Positives 👍 :-
- ఎప్పటిలాగే సూర్య తనదైన మార్క్ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తారు. సూర్య ఎంట్రీ నుంచి చివరిదాకా ఎక్కడ ఓవర్ డోస్ లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. గర్భవతి గా న్యాయం కోసం పోరాడే లిజోమల్ జోస్ పాత్రలో జీవించేసింది. రాజన్న గా చేసిన మణికందన్ కూడా బాగా చేసారు. సూర్య కి ఎదురుగా వాదించే లాయర్ గా రావు రమేష్ మంచి బూస్ట్ అప్ ఇచ్చారు కోర్ట్ సీన్స్ కి. మిగితా పాత్రధారులు కూడా వారి వారి పాత్రకు న్యాయం చేసారు.
- దర్శకుడు ఙ్ఞానవెల్ తా సే సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపే విధానం చాల బాగుంది. కధ మరియు కథనం చాలా బాగా రాసుకున్నారు.
- కోర్టు సన్నివేశాలు చాల బాగున్నాయి.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉంది.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
- ఎడిటింగ్ బాగుంది.
Negatives 👎 :-
- లెంగ్త్ ఎక్కువ.
- మొదటి భాగం లో మెయిన్ స్టోరీ కి రావడానికి ఎక్కువ సేపు తీసుకుంటారు. కొన్ని అనవసరపు సన్నివేశాలు ట్రిమ్ చేయచ్చు.
Overall :-
మొత్తానికి జై భీమ్ అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటిలాగే సూర్య తన మార్క్ నటనతో అభిమానులను అలరించి మంచి విజయాన్ని దక్కించుకున్నారు. దర్శకుడు ఙ్ఞానవెల్ తా సే కథను నడిపే విధానం చాల బాగుంటుంది. కోర్టు రూం లో జరిగే సన్నివేశాలు సినిమాకే హైలైట్ మరియు సగటు ప్రేక్షకులని ఆలోచించేలా చేస్తాయి.
సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. నిర్మాణ విలువలు చాల స్టైలిష్ గా తెరమీద కనబడ్డాయి. లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, మెయిన్ ప్లాట్ కి రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కొన్ని అనవసరపు సన్నివేశాలు. ఈ మూడు రిమార్క్స్ పక్కన పెట్టేస్తే ఈవారం కుటుంబం అంత ఈ జై భీమ్ సినిమాని హ్యాపీ గా చూసేయచ్చు .
Rating :- 3.25 /5