Tollywood news in telugu
Janhvi Kapoor: అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్…ఆటో నడిపిన వైరల్ వీడియో !

Janhvi Kapoor Auto Riksha Driving Video: అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటవారసత్వాన్ని తన చేతిలోకి తీసుకొని తన తల్లి పేరును నిలబెట్టటానికి ఆచి తూచి అడుగులు వేస్తుంది. జాన్వీ సినిమాలతో బిజీగా ఉంటూనే , సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.
జాన్వీ కి కొంత సమయం దొరికితే , తన చిలిపి పనులతో అభిమానుల మనసు దోచుకుంటుంది. ఇంతక ముందు సెట్ లో క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్న ఈ భామ ఇపుడు ఏకంగా ఆటో రిక్షా నడిపి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాస్త కూడా భయమనేది లేకుండా ఎంతో ప్రొఫిషినల్ గా నడిపింది.
ప్రస్తుతం జాన్వీ ‘గుడ్ లక్ జెర్రీ’ అనే మూవీలో నటిస్తోంది. త్వరలో టాలీవుడ్ లోకి ఎంటర్ కాబోతున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ భామ టాలీవుడ్ లో ఏ హీరో ఎవరిసరాసన మొదటగా నటిస్తుందో చూడాలి .