ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టండి చూద్దాం… బుమ్రా పెళ్లి చేసుకొనే హీరోయిన్ ఈమెనెనట..!

Jasprit Bumrah : టీమిండియా పేస్ బౌలర్ ‘జస్ప్రిత్ బుమ్రా’ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఇతను ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న 4వ టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా పెళ్లి కారణంగా ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు అర్థమవుతుంది.
ఇతడు ప్రస్తుతం గుజరాత్‌లో పెళ్లి పనుల్లో బిజీగా గడుపుతున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్ అని అంటున్నారు.
బుమ్రా, అనుపమను పెళ్లి తో ఒకటి కాబోతున్నారనడానికి కారణాలు లేకపోలేదు. అదేంటంటే అనుపమ గుజరాత్‌కు వెళ్లడం..అక్కడి ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచడంతో ఈ పెళ్లి వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
అంతే కాకుండా గతంలో బుమ్రా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అనుపమ బహిరంగంగానే తెలియజేసింది. ఇంకా ఇన్‌స్టాలో బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ అనుపమ కావడం తో వీరి పెళ్లి విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.