గల్లీ ‘జాతిరత్నాలు ‘ ఈ 5 రోజుల్లో ఎన్ని వసూళ్లు రాబట్టిందిఅంటే …!

జాతిరత్నాలు ఇపుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతిమొత్తానికి తెలిసేలా విజయం సాధించింది. చిన్న సినిమానే కదా అని … తీసివేసిన వాళ్లు ఇపుడు చిత్రంగా చూస్తున్నారు. ఈ సినిమా చిన్న ఎక్స్‌పెక్టేషన్స్ తో విడుదలై, చించిపాడేస్తుంది. తెలుగు ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయిస్తూ… బారి కలెక్షన్లను రాబడుతుంది. ఈ గల్లీ పోరగాళ్లు ఇపుడు గళ్ళ ఎగురేసుకొని తిరిగేలా సక్సెస్ ని అందుకుంది. వారిని నమ్మిన నిర్మాతల జేబులు నింపుతుంది.
ఆ పరమేశ్వరుడి ఆశిస్సులతో మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘జాతిరత్నాలు’ మూవీ రికార్డులు కొల్లగొడుతుంది. మొదటి షో తో మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ, ప్రస్తుతం నడుస్తున్న సినిమాలకు గట్టి పోటీని ఇస్తుంది.

ఇప్పటికి 5 రోజులు గడుస్తున్నా టిక్కెట్ కోసం ప్రజలు నానా కష్టాలు పడుతుండం చూస్తూ ఉంటె.. కలెక్షన్స్ ఏ విదంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ 4 రోజుల్లో 20 కోట్ల మేర షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సందర్బంగా రోజు రోజు కలెక్షణాల విషయాన్నీ తెలుసుకుంటూ చిత్ర యూనిట్ ప్రతి రోజు పండగ చేసుకుంటుంది.
సినిమా పై టాక్ బాగుండటంతో సినిమా థియేటర్ లను కూడా పెంచుతున్నారు. కరోనా సమయంలో థియేటర్ రిలీజ్ ఐ ఈ 5 రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 39 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. మరో రెండు రోజుల్లో మొత్తం 50 కోట్ల క్లబ్‌లో చేరిపోతుందని తెలుస్తుంది.
స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం ఇండస్టీని ఆశ్చర్యపరిచేలా చేసింది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు చిన్న సినిమా అయినా కంటెంట్ ఉంటె ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. జాతిరత్నాలు సినిమాను డైరెక్ట్ చేసిన అనుదీప్ కేవీ కి విపరీతమైన క్రేజ్ పెరిగింది.