ఫరియా అబ్దుల్లా గ్లామర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆ టాప్ హీరో

సినిమా ఇండస్ట్రీ లో ఒక్క మూవీ హిట్ కొడితే చాలు వాళ్లకు ఆఫర్లమీద ఆఫర్లు వెతుక్కుంటూ ఇంటిముందుకు వస్తాయి. ఇపుడు ఇలాగె జాతిరత్నాలు హీరోయిన్ కి వస్తున్నాయి. ఈ మధ్యన రిలీజ్ ఐన ‘జాతిరత్నాలు’ చిత్రం యూత్ ని బాగా ఆకట్టుకుంటూ మంచి విజయాన్ని సాధించింది. అలాగే కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఇందులో కథానాయికగా నటించిన ‘ఫరియా అబ్దుల్లా’ కు హీరో రవితేజ పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమాలో బిజిగా ఉన్న రవితేజ , ఈ మూవీ తర్వాత త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా ‘ ఫరియా’ ను ఎంపిక చేయాలనీ రవితేజ దర్శక నిర్మాతలకు అడిగాడట. దీన్ని బట్టి చేస్తే చిత్రానికి కొత్తదనం అద్దెందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.