BIG BASH T20 : జోర్డాన్ సిల్క్ క్యాచ్ అదిరిపోయింది… వీడియో వైరల్ !

బిగ్ బాష్ లీగ్ లో ఒక అద్భుతం జరిగింది. జోర్డాన్ సిల్క్ గాల్లోకి ఎగిరి ఔరా అనిపించేలా బంతిని పట్టాడు. తన ఫీల్డింగ్ తో ప్రజల మనసును కట్టిపడేశాడు . ఈ క్యాచ్ కి సచిన్ సహితం వారెవ్వా అనేశాడు.
ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ‘సిడ్నీ’ 12 ఓవర్లకు ‘హరీకేన్స్‌ను’ 76/4కే కట్టడి చేసింది. ఆపై టిమ్ డేవిడ్(58), కొలిన్ ఇన్‌గ్రామ్(55) హాఫ్ సెంచరీలతో సరిపెట్టుకున్నారు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 178/8 స్కోర్ చేసారు.
అయితే, స్టీవ్ ఒకేఫె వేసిన 15వ ఓవర్‌లో వరుసగా హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి టిమ్ నాలుగో బంతికి సింగిల్ తీసుకున్నాడు. తర్వాత కొలిన్ ఐదో బంతికి మరో బౌండరీ బాదగా చివరి బంతిని కూడా సిక్స్ కొట్టాడు. బంతి బౌండరీ దాటి నేలకు తాకుతున్న సమయంలో అమాంతం గాల్లోకి ఎగిరిన జోర్డాన్ దాన్ని ఒంటిచేత్తో పట్టుకొని మైదానంలోకి విసిరేశేశాడు.
ఆలా విసిన వీడియో షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు జోర్డాన్ ఫీల్డింగ్‌కు ఫిదా అయ్యారు. నెటిజన్లు సైతం అతడి విన్యాసం చూసి ఔరా అని ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఈ మ్యాచ్‌లో ఛేజింగ్ కు దిగిన ‘సిడ్నీ’ 20 ఓవర్లలో 162/6కే సరిపెట్టుకుంది. 16 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది.
🤯 Still trying to wrap our heads around this absolutely freakish fielding effort from @jcsilk14 last night!#smashemsixers #BBL10 pic.twitter.com/Wcsrf04ynw
— Sydney Sixers (@SixersBBL) December 10, 2020