technology information

Joy S: మార్కెట్లోకి కొత్త ఎయిర్ ప్యురిఫైర్

కాలుష్యం కాలుష్యం కాలుష్యం. ఎక్కడ చూసినా నీరు, గాలి ఆహార కాలుష్యం. నీటికి వాటర్ ప్యురిఫైర్లు వాడుతున్నాం కానీ గాలిని అలాగే పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. అసలు ఇంకా చెప్పాలంటే ఇంటి బయట కంటే ఇంటి లోపలే కాలుష్యం ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. మన ఇంట్లో మనకు తెలియకుండా మనం వాడే వస్తువుల వల్ల VOCs, particulate matter, దుమ్ము  మొదలైనవి ఉంటున్నాయి. వీటి వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, అలర్జీలు ఇంకా చాలా రోగాలు వస్తాయి. అందువల్ల ఎయిర్ ప్యురిఫైర్ల అవసరం ఏర్పడింది.

Blueair సంస్థ తాజాగా Joy S అనే ఎయిర్ ప్యురిఫైర్ ను రేపు ప్రవేశ పెట్టనుంది. ఇది HEPASilent Filtration Technology తో పని చేస్తుంది. ఈ పరికరం తన చుట్టూ గాలిలో బాక్టీరియా, వైరస్, మైక్రోప్లాస్టిక్, దుమ్ము, పోలెన్ వంటివి 0.1 మైక్రాన్ల వరకు హరించగలదు. ఇది 99.97 శాతం సామర్ధ్యంతో పని చేస్తుంది. ఇది గంటకు 5 సార్లు గాలిని శుద్ధి చేస్తుంది. అంతే కాదు దీనిని వాడటానికి కేవలం ఒక్క బటన్ వత్తితే చాలు. అలాగే దీనిలోని ఫిల్టర్ మార్చాల్సిన సమయం కూడా ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ఈ పరికరం ఒక ఫ్యాన్ వినియోగించే విద్యుత్తును మాత్రమే వాడుకుంటూ గాలిని శుద్ధి చేస్తుంది. ఈ పరికరాన్ని రేపు అమెజాన్ సంస్థ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ Joy S ధర 14999 మాత్రమే.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button