కాజల్ పెళ్లి తర్వాత విందు గెస్ట్స్ ఎవరో తెలుసా ?
kaajal reception : “లక్ష్మీ కళ్యాణం” చిత్రంతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి… “చందమామ” చిత్రంతో తన నటన, అందచందాలతో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది…. ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్థమై వుంటుంది…ఆమెనే కాజల్ అగర్వాల్… గత 10 సంవత్సరాల నుండి 50పైగా సినిమాలలో నటిస్తూ…. ప్రేక్షకుల నుండి ఆదరణ పొందుతుంది…
ఇటీవలే అక్టోబర్ 31న కాజల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ క్లిచ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే… దీంతో పెళ్లి కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూజలు, పూర్తి అవ్వడంతో.. హైదరాబాద్ లో మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు… ఈ రిసెప్షన్ కి టాలీవుడ్ అగ్ర నటినటులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం….
కాజల్ తో నటించిన చిరంజీవి ఫామిలీ , అల్లు అర్జున్ , నాగార్జున ఫామిలీ , నవదీప్ , ప్రభాస్ , ఇలా తనతో నటించి అలాగే పనిచేసిన అనుబంధం ఉన్న ఇతర ప్రముఖుల్ని ఆహ్వానిస్తుంది .
ఈ పెళ్లి పనులు అన్ని పూర్తయిన తర్వాత కాజల్ అగర్వాల్ షూటింగ్ లో పాల్గొన్న బోతుంది… ప్రస్తుతం కాజల్ తెలుగు, తమిళ్,హిందీ భాషలొ 5 సినిమాలో నటిస్తానని ఒప్పు కుంది…తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న “ఆచార్య” చిత్రం..ఈ సినిమాలో హీరో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటించబోతుంది… తమిళంలో శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు-2 సినిమాలో హీరో కమల్ హాసన్ సరసన 80 సం||ల వృద్ధురాలి పాత్రలో కాజల్ నటించబోతోంది. ఇంకా పలు భాషలోని వెబ్ సిరీస్ లో కూడా కాజల్ మెరవబోతుంది…