Tollywood news in telugu

వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ కైలాసపురం కింగ్స్ టీజర్ లాంచ్ !!!

వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ కైలాసపురం కింగ్స్ టీజర్ లాంచ్*

వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ కైలాసపురం కింగ్స్ టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే నిర్మాత రాజ్ కందుకూరి, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత రిజ్వాన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అథితులుగా విచ్చేసారు.

*ఈ సందర్బంగా నిర్మత రాజ్ కందుకూరి మాట్లాడుతూ…*

ఈ సినిమా నేను చూశాను, బాగా నచ్చింది. వైజాగ్ నేపథ్యంలో జరిగే మాస్ ఎంటర్టైన్ సబ్జెక్ట్ ఇది. కంచర్ల పాళ్యం సినిమా తరహాలో ఈ సినిమా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయనుంది. ఆడియన్స్ కు కావాల్సిన అనీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కైలాసపురం కింగ్స్ లో నటించిన నటీనటులకు టెక్నీషియన్స్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

*ఈ సందర్భంగా నిర్మాత తేజ్ వైజాగ్..*

నాకు వైజాగ్ అంటే ప్రాణం. వైజాగ్ లో జరిగే చిత్ర షూటింగ్స్ కు నేను హెల్ప్ చేస్తుంటాను. నాకు ర్ చిత్ర కథ దర్శకుడు కులదీప్ చెప్పగానే నచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది అన్నారు.

*డైరెక్టర్ కులదీప్ రాజాన మాట్లాడుతూ…*

నేను రాసుకున్న కథకు హీరో రమేష్ పూర్తి న్యాయం చేశాడు. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. నిర్మాత తేజ్ వైజాగ్ గారు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ సినిమాను బాగా నిర్మించారు అన్నారు.

*మనిక్ బాషా హీరో సందీప్…*

కైలాసపురం కింగ్స్ హీరో రమేష్ నాకు బాగా ఫ్రెండ్, నను మంచి నటుడు. కైలాసపురం టీజర్ చూస్తుంటే తెలుస్తోంది తాను నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని నమ్మకం కలిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

*హీరో రమేష్ మాట్లాడుతూ*

నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికి థాంక్స్. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన రిజ్వాన్ గారికి థాంక్స్. కైలాసపురం అనేది పక్కా మాస్ ఎంటర్టైనర్ అందరికి నచ్చే సినిమా ఇది అన్నారు.

*హీరోయిన్ గరిమా సింగ్ మాట్లాడుతూ..*

నాకు కైలాసపురం సినిమాలో నటించడానికి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రేమలో ఉన్న కొత్త కోణాన్ని ఈ సినిమాలో దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు. త్వరలో రానున్న ఈ సినిమా మీకు నచ్చుతుంది అన్నారు.

నటీనటులు:

రమేష్ కుర్మాపు

గరిమా సింగ్

ప్రసన్న కుమార్

శ్రీమణి

సాంకేతిక నిపుణులు:

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: కులదీప్ రాజన్

బ్యానర్: వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ

నిర్మాత: క్రౌడ్ ఫండింగ్

డైలాగ్స్: అరుణ్ వైరిచర్ల

మ్యూజిక్: త్రినాధ్ మంతెన

కెమెరామెన్: జాన్ విక్టర్ పాల్

కాస్టూమ్ డిజైనర్: అరుంధతి బిజ్జ

పి.ఆర్.ఓ: మధు వి.ఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button