kajal : మా ఇద్దరి ప్రేమ నుంచి ఈ ప్రోడక్ట్ పుట్టింది….వెంటనే కోనేయండి స్టాక్ తక్కువగా ఉంది !

‘లక్ష్మి కల్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లో కి ఎంటరై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మనసులో ఒక ముద్రవేసుకొని మంచి ఇమేజ్ ని సంపాదించుకుంది. బాలీవుడ్ , టాలీవుడ్‌లో అనే తేడాలేకుండా అటు టాప్ హీరోలతో మరియు కొత్తగా వచ్చే యువ హీరోలతో నటిస్తూ ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది.
ఈ మధ్యనే కాజల్ అగర్వాల్ వైవాహిక బంధంలోకి అడుగెట్టి భర్త వెనకాలే నడుస్తోంది తన బిజినెస్ కి సపోర్టుగా ఉంటుంది. తాజాగా కాజల్ అగర్వాల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ‘కిచ్డ్’ అనే పేరుతొ హోమ్ డెకర్ బ్రాండ్‌ని ప్రారంభించింది. ఈ సందర్భంలో ఈ బ్రాండ్ గురించి కాజల్ మాట్లాడుతూ మా ఇద్దరి ప్రేమ నుంచి ఈ బ్రాండ్ పుట్టిందని, ప్రస్తుతం ఫెస్టివ్ థీమ్‌తో చేతితో తయారుచేయబడిన కుషన్స్‌ని మేము మీ ముందుకు తీసుకొస్తున్నామని తెలిపింది.
మా ఉద్దేశం మీ ఇంటి అందాన్ని పెంచేలా ఈ మా ప్రాడక్ట్స్ తాయారు చేయబడుతున్నాయి . మేము తీసుకొచ్చే ప్రతీ బ్రాండ్ ని ఆదరిస్తారని కోరుకుంటునని , ‘కిచ్డ్’ బ్రాండ్ లిమిటెడ్ మాత్రమే ఉన్నాయ్ , వెంటనే షాపింగ్ చేయండి అని ప్రజలని కోరింది.