Tollywood news in telugu
కాజల్ కి లక్ష్మి వార్ణింగ్ … పార్టీ కోసమేనట !

కాజల్ అగర్వాల్ ముంబై కి చెందిన వ్యక్తితో పెళ్లిచేసుకొని హనీమూన్ కూడా చేసుకుంటుంది. కరోనా నిబంధనల ప్రకారం కాజల్ తనను పెళ్ళికి పిలవక పోయిన పార్టీమాత్రం కావాలంటుంది , ఈ విషయంలో మంచులక్ష్మీ వార్ణింగ్ కూడా ఇచ్చిందట. ఈ విషయాన్నీ ఒక టివి షోలో తెలియజేసింది.
తనకి కాజల్ తో అక్కాచెల్లెళ్ల అనుబంధం ఉందని, ప్రతీ విషయాన్నీ తనతో పంచుకుంటుందని లక్ష్మి చెప్పుకొచ్చింది.
ఇక లక్ష్మి కోరినట్టు తెలుగు ఇండస్ట్రీ వాళ్లకు పార్టీ ఇవ్వాలంటే ఈ కరోనా వల్ల చాల సమయమే పట్టేట్టు ఉంది.
కాజల్ ప్రస్తుతం ఆచార్య, భారతీయుడు సినిమాలతో బిజీగా గడపనుంది .ఈ సినిమాలు కాకుండా కాజల్ చేతిలో మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. కాజల్ ఆచార్య షూటింగ్ లో జాయిన్ కాగానే కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను చిత్రీకరించనున్నారని సినీవర్గాలు తెలియజేశాయి.