Kanchana 3 actress alexandra suicide సూసైడ్ చేసుకున్న ప్రముఖ నటి

Kanchana 3 actress suicide : రాఘవ లారెన్స్ ఎపుడు ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇయ్యాలనే హారర్ సినిమాలే చేస్తుంటారు. అలాంటి సీరీస్ ఈ కాంచన. ఈ కాంచన సిరీస్ లో ఇప్పటికి 4 పార్ట్స్ వచ్చాయి. అందులో చివరి భాగం లో రాఘవ కి ప్రేయసిగా చేసిన అమ్మాయే సూసైడ్ చేసుకుంది.
అవును మీరు విన్నది నిజమే కాంచన 4 లో రాఘవ లారెన్స్ కి లవర్ గా చేసిన అమ్మాయి పేరు అలెగ్జాండ్రా జావి. ఈమె రష్యన్ కి చెందిన అమ్మాయి. ఈమె గతం లో చెన్నైలోని ఫోటోగ్రాఫర్ లైంగికంగా వేధించారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి.
అయితే ఈమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణం బ్రేక్ అప్ అనే అంటున్నారు. ఎంతో కాలంగా చాలా ఘాడంగా ప్రేమించుకున్నారని , సడన్ గా బ్రేక్ అప్ అయ్యేసరికి తట్టుకోలేక డిప్రెషన్ కి గురయి సూసైడ్ చేసుకుందని సమాచారం. అయితే తాను ఎవరిని ప్రేమించిందో, ఆ ప్రేమికుడెవరో ఇంకా క్లారిటీ లేదు.
కాబట్టి పోలీసులు ఈ అమ్మాయిని లైంగికంగా వేధించిన ఫోటోగ్రాఫర్స్ నుంచే ఇంటరాగేషన్ మొదలుపెట్టబోతున్నారు. చూడాలి మరి ఈ సూసైడ్ కేసు ఎన్ని మలుపులు తిరగనుందో.