Kangana Raut: వారి తలలు తీసే సమయం వచ్చింది

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఎప్పటినుండో బాలీవుడ్ లోని నెపోటిజం పై పోరాడుతూన్న సంగతి తెలిసిందే . గతేడాది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై సంచలన ఆరోపణలు చేస్తూ బాయికట్ బాలీవుడ్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ వివాదాస్పద లేడి మరో కాంట్రవర్సికి తెరలేపింది. ఇటీవలే జనవరి 15న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన “తాండవ్” వెబ్ సిరీస్ లో.. హిందూ దేవుళ్లను అవమానించే సన్నివేశాలు ఉన్నాయని క్వీన్ కంగనా మండిపడ్డారు.” శ్రీకృష్ణుడు శిశుపాలుడు చేసిన 99 తప్పులకు తగిన శిక్షణ వేశాడు. మొదట శాంతి.. తర్వాతే విప్లవం. వారి తలలు తీసే సమయం వచ్చింది…జై శ్రీ కృష్ణ” అంటూ తీవ్ర వ్యాఖ్యలను కంగనా ట్వీట్ చేశారు.
దీంతో కొందరు నెటిజన్లు కంగనా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ట్విట్టర్లో సస్పెండ్ కంగనా అనే హాష్ టాగ్ ను ట్రెండ్ చేయడంతో … ట్విట్టర్ యాజమాన్యం కంగనా రనౌత్ ఎకౌంట్ టెంపరరీగా సస్పెండ్ చేసింది.