కల్యాణి అలాంటి పనులు ఎందుకు చేస్తుందంటె?

karate kalayani : ఒక అన్యాయంపై పోరాడాలంటే డబ్బుంటే సరిపోదు, దైర్యం కూడా ఉండాలి. మరి ఆ దైర్యం తో ముందు నిలిచి పోరాడేవాళ్లు చాల తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువమందిలో ఒకరే కరాటే కళ్యాణి. గతంలో సినీ ఇండస్ట్రీలో నెలకొన్న క్యాస్టింగ్ కౌచ్, రామతీర్థం ఘటనలపై నటి కరాటే కల్యాణి పోరాటాలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. గోవుల అక్రమ తరలింపుపై కూడా ఆమె తన వంతు గా పోరాడింది. తాజాగా మరో పోరాటానికి ఆమె సిద్ధమయ్యారు. ఒక ముస్లిం యువకుడి వల్ల మోసపోయిన ఒక యువతికి న్యాయం జరగాలని ఆమె పోరాటానికి నడుంబిగించింది.

దివ్య అనే హిందూ అమ్మాయి లవ్ జిహాద్ కు గురయిందని… తాసిఫ్ అనే ముస్లిం యువకుడు దివ్యను ట్రాప్ చేసి మోసం చేసి వదిలేసాడని కళ్యాణి ఆరోపించారు. దివ్యను పెళ్లి చేసుకున్న తర్వాత చిత్ర హింసలకు గురి చేసాడని, ఇప్పుడు తలాక్ చెప్పి వదిలించుకున్నాడని , కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా సమక్షంలో డిమాండ్ చేశారు.