Karthika Deepam Climax: కార్తీక దీపం సీరియల్ క్లైమాక్స్ గురించి …..ఆసక్తికర విషయాలు చెప్పిన డాక్టర్ బాబు !

Karthika Deepam Climax: తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ ప్రపంచంలో తెలుగువారు అందరు ఈ సీరియల్ ని ఎంతగానో ఆదరిస్తున్నారు. సాయంత్రం ఏడున్నర దాటితే చాలు టీవీ ల ముందు వాలిపోతున్నారు. ఈ సీరియల్లో వంటలక్క , డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారు. ఆ మోనిత అసలు రంగు ఎప్పుడు బయట పడుతుందోనని ఈ సీరియల్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక కార్తీక దీపం క్లైమాక్స్ విషయానికి వస్తే ఇటీవల నిరుపమ్ పరిటాల ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న వేశారు అదేంటంటే…కార్తీక దీపం క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది, మోనితని పెళ్లి చేసుకుంటారా? దీపకు దగ్గర అవుతారా? అని అడగగా.. డాక్టర్ బాబు మాట్లాడుతూ ఈ సీరియల్ లో నటించడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.
ఇందులో నాకు ఇంతమంచి పేరు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి భిన్నమైన క్యారెక్టర్ వల్ల , భిన్నమైన కథ వల్ల నాకు, కార్తీక దీపం సీరియల్ లో పనిచేస్తున్న వలందరికి మంచి గుర్తింపు వచ్చింది.
ఇక క్లైమాక్ గురించి మాట్లాడాలంటే … ఈ సీరియల్ చూస్తున్న ప్రతీ ఒక్కరికి నచ్చేలా ఈ సీరియల్ యొక్క ముగింపు ఉంటుందని సమాధానం ఇచ్చారు.