Karthika deepam september 22 episode

karthika deepam september 22 episode : అనూహ్యమైన మలుపులతో, ఆసక్తికరమైన కథాకథనాలతో, బుల్లితెర ప్రేక్షకులను ఆడ్యాంతం అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో…( సెప్టెంబర్ 22) Check here for karthika deepam september 21 episode
సీరియల్ మొదలవగానే హిమ ఏడుస్తూ ..
బాధ పడుతూ ఇలా ఉంటుంది ..’ఇది నా ఇల్లు కాదు.. నువ్వు డాడీవి కాదు..
నాకు ఎవరూ లేరు.. నేను అనాధను.. నేను ఇక్కడ ఉండను..’అంటూ ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీస్తుంది హిమ. వెనకాలే కార్తీక్ సౌందర్య, దీప, కూడా కంగారు పడుతూ వెళ్తారు. ఇంతలో దీప కంగారు పడుతూ ‘ హిమ నువ్వు వెళ్ళిపోతే నా మీద ఒట్టే అంటుంది’. దీప అలా అనడంతో హిమ అక్కడే ఆగిపోతుంది. దీప పరుగున వెళుతూ హిమకు నిజం చెప్పాలి అనుకుంటుంది.. కానీ కార్తీక్ బాధను చూసి ఆగిపోతుంది.
అప్పుడు కార్తీక్ పరుగున వచ్చిన బాధతో హిమ ను పట్టుకుని ఇలా అంటాడు..’ అమ్మ హిమ, ఎక్కడికి వెళ్తున్నావ్..? ఎందుకు వెళ్తున్నావ్..? నన్ను అనాధను చేసి వెళ్ళిపోతావా..? ఇది నీ ఇల్లు.. మేమందరం నీ వాళ్ళం.. నిన్ను కనకపోయినా కన్న కూతురు కంటే ఎక్కువగా చేసుకున్నాం.. నువ్వు లేకుండా నేను బతకలేను.. ఇంకెప్పుడూ కూడా వెళ్ళిపోతాను అనొద్దు అమ్మ హిమ’ అని అంటాడు కార్తీక్.
హిమ కార్తీక్ లోపలికి తీసుకుని వెళదాం అని అనుకుని.. హిమ చేయి పట్టుకుని’ రా హిమ లోపలికి’ అంటూ చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఇంతలో హిమ.. ఎక్కడికండి..? అంటుంది. ఈ మాట విని కార్తిక్ నిర్ఘాంత పోతాడు. ‘ఏమన్నావ్ ‘ అని అడుగుతాడు.’అవునండి.. ఇది మీ ఇల్లు కదా.. నేను అనాధను కదా.. నాకు ఇల్లే లేదు.. నేను దిక్కులేని దాన్ని.. అమ్మ ..నాన్న ఎవరో తెలియదు.. నేను మీ ఇంట్లో ఎలా ఉండగలను అండి..అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా అబద్ధమే.. కానీ, ఆ అబద్ధమే బాగుందండి..’ అని హిమ కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతుంటే అక్కడ ఉన్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి..
వెంటనే సినిమా దీప దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకుని ‘వంటలక్క.. మీరే కాదు నేను కూడా వీళ్ళకు ఇకనుంచి పరాయి దాన్నే..’ అంటుంది. అప్పుడు సౌందర్య హేమ దగ్గరకు వెళ్లి ఏడుస్తూ..’అమ్మ హిమ.. అలా అనకే. నువ్వు ఎప్పుడు మాకు అనాధవు కాదు.. నిన్ను ఎప్పుడూ మేము అలా పెంచలేదు.. నీకు మేము అందరం ఉన్నాము.. ఇది నీ ఇల్లు.. మీ నాన్న ముఖం వైపు ఒకసారి చూడు.. ఎలా ఉన్నాడో చూడవే.. నువ్వు ఇలా మాట్లాడుతుంటే వాడు గుండె ఎంతగా కుమిలి పోతుందో నీకు తెలుసా?’ అని అంటుంది. వెంటనే ఆదిత్య బాధపడుతూ,
హిమ తో ఇలా అంటాడు..’ మీ డాడీ నిన్ను ఎప్పుడైనా పరాయి దానిలా చూసాడా? నిన్ను ఎంత చక్కగా పెంచాడు? నీకు ఎంత చేశాడు.. అవన్నీ మర్చిపోయావా హిమ..’అంటాడు. ఇంతలో శ్రావ్య బాధపడుతూ ..’అందుకే చెప్పదు అన్నాను అత్తయ్య గారు.. మీరే వినలేదు..’ అంటుంది.
ఇంతలో సౌందర్య ఆవేశంతో కార్తీక్ తో ఇలా అంటుంది..’వింటున్నావా దాని మాటలు..(హిమ) చిన్న అబద్ధానే సహించలేని ఈ పసిగుడ్డు… ఇంత పెద్ద నిజాన్ని ఎలా భరిస్తుతుంది అనుకున్నావురా.. ఇప్పుడు అది అడిగే ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం ఉంది. ఎవరు సమాధానం చెప్పగలరు..?’ అంటుంది. వెంటనే దీప కూడా’ అవును డాక్టర్ బాబు, మీరు ఇలా బాధ పడవలసి వస్తుందని నిజం చెప్పొద్దు అనాం..’ అని అంటుంది. ఈ మాటలు విన్న కార్తిక్ కి కోపం వస్తుంది..’ అసలు ఈ పరిస్థితికి కారణం మీరు.. మీవల్లే వేరే ఫోటో తెచ్చి తల్లిగా చూపించవలసి వచ్చింది.. ఇదంతా నీ వల్లే.. కానీ ఇప్పుడు మాత్రం మీరు నన్ను దోషిని చేస్తున్నారా.. అని ప్రశ్నిస్తాడు? అప్పుడు సౌందర్య ఆవేశంతో..’ అదంతా నాకు తెలియదు.. నా మనవరాలు మళ్లీ నా ఇంట్లో ఉండాలి అంతే..’ అని కార్తీకి ఆర్డర్ వేస్తుంది.
దాంతో కార్తీక్ హేమను తన దగ్గరకు తీసుకుని చేతులు పట్టుకుని ఇలా అంటాడు..’ రా అమ్మ మన ఇంటికి’ కార్తీక్ ఎంత పిలిచినా కూడా హిమ లోపలికి వెళ్లకుండా ఏడుస్తూనే ఉంటుంది. హిమ బాధపడుతూ ఇలా అంటుంది..’నన్ను ఇక్కడి నుంచి తీసుకు వచ్చారండి.. చెప్పండి.. అక్కడికి తిరిగి వెళ్ళిపోతాను..’ అని అంటుంది. ఈ మాటలకు దీప బాధపడుతూ.. సౌందర్య వైపు చూస్తు ఇలా అంటుంది..’చెప్పండి.. అడుగుతోందిగా.. తల్లి చచ్చిపోతే పొత్తిళ్ల నుంచి ఎత్తుకు వచ్చారా..? లేదా తుప్పల్లో పడి ఉంటే తీసుకొచ్చారా..? అని దెప్పిపొడుస్తుంది.. అప్పుడు సౌందర్య బాధతో దండం పెడుతూ..’నేనే తప్పు చేశాను.. నా వల్లే ఈ తప్పు జరిగింది.. అందుకు నా కొడుకుకి ఇంత శిక్ష పడుతుంది అనుకోలేదు..’ అంటుంది ఏడుస్తూ.
అందుకు దీపా మరింత బాధ పడుతూ..’మీకు మీ కొడుకు మాత్రమే నా శిక్షని అనుభవించేది..? (నేను కూడా పాస్ అనుభవిస్తున్నాను కదా అని.. సౌందర్య కి మాత్రమే అర్థమయ్యే ఈ విధంగా) అనడంతో, సౌందర్య మరింత బాధ పడుతుంది..’నీ మాటలతో నన్ను మరింత చిత్రవధ చేయొద్దు’ అని దీపతో అంటుంది.
అప్పుడు కార్తీక్ హిమ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు..’ అమ్మ హిమ. నువ్వు అనాధవు కాదమ్మా.. నీకు నేను ఉన్నాను.. నీకు అమ్మను, నాన్నను నేనే.. నువ్వు అనాధ అన్న విషయాన్ని నీ మనసులో నుంచి తీసేయ్ అమ్మ.. రా అమ్మ లోపలికి వెళ్దాం..’ అని చాలా ఆశతో రిక్వెస్ట్ చేస్తాడు.
కానీ నేను మాత్రం అడుగు కూడా పద పద.
హిమ పాత పడుతూ ఇలా అంటుంది..’వద్దండి.. ఎలా రావాలి మీ ఇంట్లోకి..? నేను అనాధను కదా. ఇంతకు ముందు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ల మీద అరిచేదాన్ని.. వాళ్లలో గొప్ప పడేదాన్ని.. కానీ ఇప్పుడు నేను అలా
అరవగలనా.. ఇంతకు ముందు నాకు ఏది కావాలన్నా కూడా మా డాడీ నే కదా అని వెంటనే అడిగేదాన్ని.. కానీ ఇప్పుడలా అడగ గలన.. వంటల అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపిస్తే.. నాకు కారు కావాలి అని చెప్పే దాన్ని.. కానీ నేను ఇప్పుడు అలా కారులో దర్జాగా వెళ్లగలనా..?’ అని ప్రశ్నిస్తుంది.
అంతేకాదు ఎప్పుడైనా సౌర్య మరి ఇంటికి వస్తే.. ఈ బొమ్మ తో ఆడుకోవచ్చా..? ఆ బెడ్ పైన పడుకోవచ్చా..? అని అడిగేది.. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే కదా.. మీరు నాకు అన్నం పెట్టడమే చాలా ఎక్కువ’.. అంటుంది హిమ బాధ పడతూ..
అయితే సినిమా మళ్ళీ హిమ మామూలుగా మారుతుందా.. ఈ కథ ఎలా సుఖాంతం అవుతుంది.. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం..
కార్తీకదీపం కొనసాగుతోంది..