Tollywood news in telugu
కోటి రూపాయలు కొంప ముంచిన… కత్తి కార్తీక

kathi karthika అమీనాపూర్ డెవలప్ చేయడానికి తక్కువ ధరకు 52 ఎకరాలు ఇప్పిస్తానని. ఒక ప్రైవేట్ కంపెనీ నుండి ఒక కోటి తన కాతాలో వేయాలని కార్తీక డిమాండ్ చేసినట్టు, ఆ కంపెనీ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.
వివరాలలోకి వెళ్తే ఫిలింనగర్ కి చెందిన పచ్చిపాలా దొరస్వామి, అమీన్ పుర లో స్థలం తీసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్నీ దొరస్వామి ఫ్రెండ్ శ్రీధర్ కి చెప్పాడు. అపుడు శ్రీధర్ అనేవ్యక్తి భూమి క్రయవిక్రయాల కు మధ్యవర్తిత్వం చేసే కత్తి కార్తీకను పరిచయం చేసాడు.
కార్తీక తన మాయమాటలతో దొరస్వామిని నమ్మించి తన అకౌంట్లో కోటి డిపాజిట్ చేయించుకుంది.
అయితే కార్తీక చూపించే ఆ 52 ఎకరాలు కు కార్తీకకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకున్న దొరస్వామి, కార్తీక పై కార్తీక అనుచరులపై చీటింగ్ కేసు నమోదుచేసాడు.